Kuwait: కువైట్ ను వెలేసిన ఫిలిప్పినో మహిళలు

తమ దేశానికి చెందిన మహిళ అత్యంత కిరాతంగా హత్యకు గురవ్వడంతో వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్ కు చెందిన 114 మంది మహిళలు అకస్మాత్తుగా దేశాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పిలిప్పీన్ కు చెందిన 35ఏళ్ల జుల్లేబీ రానరా అనే కార్మికురాలిపై 17ఏళ్ల యజమాని కొడుకు లైంగిక దాడి చేసి, అనంతరం ఆమెను సజీవంగా తగలబెట్టిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె మృతదేహం ఎడారిలో దొరకగా, 24గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. హత్యకు గురైన సమయంలో సదరు మహిళ గర్భవతి అని వెల్లడైంది. జుల్లేబీ మృతదేహం స్వదేశానికి చేరగా, ఆమె మృతికి నిరసనగా 114మంది మహిళా కార్మికులు కువైట్ ను వీడి స్వదేశానికి పయనమయ్యారు. వీరికన్నా ముందు 80 మంది స్వదేశానికి చేరుకున్నారు. జుల్లేబీ మృతి అనంతరం గల్ఫ్ దేశ కార్మిక నియామక సంస్థలపై ఫిలిపినో మైగ్రెంట్ వర్కల్ల సంఘం వేటు వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com