కువైట్ పాలకుడు కన్నుమూత

X
By - Nagesh Swarna |29 Sept 2020 9:36 PM IST
కువైట్ పాలకుడు 'షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబా' కన్నుమూశారు. షేక్ సబా మృతి చెందిన విషయాన్ని కువైట్ రాజభవనం అధికారికంగా ప్రకటించింది. ఆయన ఏ కారణంతో చనిపోయారనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న షేక్ సబా జూలై 2020 లో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత అధునాతన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. అమెరికా వెళ్లే ముందు తన బాధ్యతలను తన వారసుడు, క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబాకు తాత్కాలికంగా అప్పగించారని కువైట్ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఆపరేషన్ ఎందుకు జరిగింది? అమెరికాలో ఎక్కడ చికిత్స తీసుకున్నారు? మరణానికి దారి తీసిన కారణాలేంటి? అనే వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com