Vijay Mallya: లండన్‌లో విజయ్‌ మాల్యా బర్త్‌డే లలిత్ మోదీ గ్రాండ్ పార్టీ..

Vijay Mallya: లండన్‌లో  విజయ్‌ మాల్యా బర్త్‌డే   లలిత్ మోదీ గ్రాండ్ పార్టీ..
X
హాజరైన కిరణ్‌ మజుందార్‌ షా

భారత్‌లో ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్‌లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్తలు లలిత్ మోదీ, విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో నిలిచారు. విజయ్ మాల్యా 70వ పుట్టినరోజును పురస్కరించుకుని, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ లండన్‌లోని తన నివాసంలో ఘనంగా ప్రీ-బర్త్‌డే పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను ఫోటోగ్రాఫర్ జిమ్ రైడెల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. "విజయ్ మాల్యా గౌరవార్థం లలిత్ మోదీ తన లండన్ ఇంట్లో అద్భుతమైన ప్రీ-బర్త్‌డే పార్టీ ఇచ్చారు" అని రైడెల్ పేర్కొన్నారు. దీనికి లలిత్ మోదీ బదులిస్తూ, "నా స్నేహితుడు విజయ్ మాల్యా ప్రీ-బర్త్‌డే వేడుకలకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు" అని తెలిపారు.

ఈ వేడుక ఆహ్వాన పత్రికలో మాల్యాను 'కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్' అని అభివర్ణించారు. పార్టీలో నటుడు ఇడ్రిస్ ఎల్బా, ఫ్యాషన్ డిజైనర్ మనోవిరాజ్ ఖోస్లా వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కిరణ్ మజుందార్ షా ఒక ఫొటోలో ఖోస్లాతో, మరో ఫొటోలో ఎల్బాతో మాట్లాడుతూ కనిపించారు.

మాల్యా, మోదీ ఇలా పార్టీలలో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో లలిత్ మోదీ పుట్టినరోజు వేడుకలకు, ఆయన నిర్వహించిన ఓ కచేరీ కార్యక్రమానికి కూడా మాల్యా హాజరయ్యారు. కాగా, భారత్‌లో పలు ఆర్థిక, నియంత్రణపరమైన కేసులను ఎదుర్కొంటున్న ఈ ఇద్దరూ ప్రస్తుతం యూకేలోనే నివసిస్తున్నారు. అయితే, తమపై ఉన్న ఆరోపణలను వారు మొదటి నుంచి ఖండిస్తూ వస్తున్నారు.

Tags

Next Story