Hawaii volcano: హవాయిలో అగ్నిపర్వతం విస్ఫోటనం..

అమెరికాలోని హవాయి అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో 100 అడుగులకు పైగా లావా ఎగసిపడుతుంది. హవాయి అగ్నిపర్వత ప్రాంతంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత చురుకైన కిలోవియా శిఖరంపై బిలం నుంచి గతేడాది డిసెంబర్ 23న విస్ఫోటం మొదలైనట్లు అధికారులు తెలిపారు. క్రమంగా ఆ విస్ఫోటం పెద్ద ఫౌంటెయిన్‌లా మారి మంగళవారం ఆ అగ్నిపర్వతం నుంచి ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తుకు లావా ఎగసిపడిందని హవాయి అగ్నిపర్వత అబ్జర్వేటరీ పేర్కొంది.
ప్రస్తుతం లావా 150 నుంచి 165 అడుగుల వరకు ఎగసిపడుతోందని.. మరింత ఎత్తుకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పర్వతం ఎత్తైన ప్రాంతంలో ఉన్నందువల్ల స్థానిక నివాసితులకు ఎటువంటి ముప్పు లేదని అన్నారు. అగ్నిపర్వతం వద్ద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. పర్వత ప్రాంత సమీపంలోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com