Lay Offs : డిస్నీలో 7వేల ఉద్యోగాలకు ఎసరు

Lay Offs : డిస్నీలో 7వేల ఉద్యోగాలకు ఎసరు
X
ఖర్చులను తగ్గించుకోవడానికి 7వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన

లేఆఫ్ .. ఈ పేరు వినగానే ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఇప్పటికే గుగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఖర్చులు తగ్గించుకునే భాగంలో ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ఆయా సంస్థల అధికారులు ప్రకటించారు. తాజాగా.. ఈ వరుసలో.. డిస్నీ చేరింది. ఖర్చులను తగ్గించుకోవడానికి 7వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

డిస్నీ సీఈఓ రాబర్ట్ ఇగెర్ ఖర్చులను తగ్గించుకోవడానికి 7వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. "మేము ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా కంపెనీ ఉద్యోగుల ప్రతిభ, అంకితభావం పట్ల నాకు అపార గౌరవం ఉంది. అయితే కంపెనీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తప్పడం లేదు"అని అన్నారు రాబర్ట్ ఇగెర్.

డిస్నీ తన ప్రథమ ప్రథ్యర్థి నెటిఫ్లిక్స్ మాదిరి చందాదారుల విషయంలో వెనకబడి ఉంది. యూఎస్, కెనడాలో కేవలం 2 లక్ష ల మంది సబ్ స్క్రైబర్ లను మాత్రమే కలిగి ఉంది. నివారణ చర్యలను ప్రారంభించిన డిస్నీ... పనితనాన్ని పెంచుకోవడంతో పాటు, లేఆఫ్స్ మీద కూడా దృష్టి సారించింది.

Tags

Next Story