Layoffs : ఫేస్ బుక్ లో ఉద్యోగాల కోత

Layoffs : ఫేస్ బుక్ లో  ఉద్యోగాల కోత
మెటా సంస్థ రాబోయే రోజుల్లో లేఆఫ్ దిశగా అడుగులు వేస్తుందని తెలిపింది వాల్ స్ట్రీట్ జర్నల్


ఫేస్ బుక్ మెటా సంస్థ ఉద్యోగులను తీసివేయడానికి సిద్ధమైంది. రాబోయే కొన్ని నెలల్లో అనేక రౌండ్లలో అదనపు ఉద్యోగులను తొలగించనుంది. గత సంవత్సరం నుంచి తొలగిస్తున్న 13 శాతం ఉద్యోగుల కొతతో సరిపోల్చవచ్చు.

వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం ప్రకటించిన నివేదిక ప్రకారం... మెటా సంస్థ రాబోయే రోజుల్లో లేఆఫ్ దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఇప్పటికే మెటా సంస్థ తన ఉద్యోగులపై కోతను విధించగా, తాజాగా మరింత మంది ఉద్యోగులను తీసివేయడానికి రంగం సిద్దం చేసింది. మెటా నాలుగు నెలల క్రితం ప్రపంచ వ్యాప్తంగా 11వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. రెండవ రౌండ్ లో కూడా భారీ కోతలు ఉన్నట్లు తెలిపారు. కొత్తగా తీసివేయనున్న ఉద్యోగాల వివరాలు వచ్చేవారం నాటికి ప్రకటించబడుతాయని తెలుస్తోంది. నివేదిక ప్రకారం నాన్ ఇంజనీరింగ్ పాత్రలను కష్టతరం చేసే అవకాశ ఉన్నట్లు సమాచారం.


Tags

Read MoreRead Less
Next Story