China: ఇన్‌ఫ్లుయెన్సర్ రికార్డ్.. ఒక్కరోజులోనే రూ.14 కోట్ల బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మకం..

Li jiaqi (tv5news.in)

Li jiaqi (tv5news.in)

China: సాధారణంగా మేకప్ గురించి, అమ్మాయిలు ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అబ్బాయిలకేం తెలుసులే అనుకుంటూ ఉంటాం.

China: సాధారణంగా మేకప్ గురించి, అమ్మాయిలు ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అబ్బాయిలకేం తెలుసులే అనుకుంటూ ఉంటాం. కానీ వాటి గురించి కూడా ఆసక్తికరంగా తెలుసుకునేవారు కూడా ఉంటారు. అంతే కాదు వారే అమ్మాయిలకు ఆ ప్రొడక్ట్స్‌ను ఎలా వాడాలో నేర్పిస్తారు కూడా. అలా నేర్పిస్తూనే ఒక యూట్యూబర్ ఒక్కరోజులోనే ఏకంగా రూ.14.23 వేల కోట్లు వస్తువులను విక్రయించాడు.

అతడి పేరు 'లీ జియాకి'. అతడు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అతడొక బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్. సాధారణంగా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని అమ్మాయిలకే ఎక్కువగా పేరుంటుంది. కానీ ఈ అబ్బాయి తన వీడియోలతో ఈ పేరును సంపాదించకున్నాడు. బ్యూటీ ప్రొడక్ట్స్ ఎలాంటివి ఉపయోగిస్తే బాగుంటుంది, మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ ఏంటి అని తన సబ్‌స్క్రైబర్లకు చెప్తుంటాడు లీ.

ముఖ్యంగా లిప్‌స్టిక్స్ విషయంలో అమ్మాయిలకు హెల్ప్ చేయడంలో లీ దిట్ట. అందుకే తను 'కింగ్‌ ఆఫ్ లిప్‌స్టిక్స్‌', 'లిప్‌స్టిక్‌ బ్రదర్‌'గా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. చైనాలోని 'టవోబవో' పేరుతో ఒక చైనీస్‌ షాపింగ్‌ యాప్‌ ఉంది. అందులో ఉద్యోగం చేస్తున్నాడు లీ. తాజాగా ఇతడు ఒక్కరోజులోనే వేల కోట్ల రూపాయల విలువ చేసే వస్తువుల్ని విక్రయించి రికార్డు సృష్టించాడు.

ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో బిగ్ బిలియన్ డేస్ లాంటి స్కీమ్స్‌ను మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అలాగే 'టవోబవో' కూడా ఇటీవల యాన్యువల్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించి భారీ డిసౌంట్లను కస్టమర్లకు అందించింది. ఆ సందర్భంగా లీ తన లైవ్‌లో అన్ని ప్రొడక్ట్స్ గురించి మామూలుగా అందరికీ చెప్తూ ఉన్నాడు. అలా ఒక్క రోజులోనే లోషన్స్‌ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ వరకు రూ.14.23 వేల కోట్లు విలువ చేసే వస్తువుల్ని విక్రయించాడు.

మామూలుగానే చైనాలో లీ చాలా ఫేమస్. తాను సాధించిన ఈ అరుదైన రికార్డుతో లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా రికార్డులు సాధించడం లీకి కొత్తేమీ కాదు. 2019లో మోడల్స్‌కు 30 సెకన్లలో అత్యధిక లిప్‌స్టిక్స్‌ రాసిన వ్యక్తిగా గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించాడు. అలా బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఆడవారికి మాత్రమే కాదు కొందరు మగవారికి కూడా వారికంటే ఎక్కువ తెలుసని నిరూపిస్తున్నాడు లీ.

Tags

Read MoreRead Less
Next Story