Putin-Kim: కిమ్‌కు సింహం, ఎలుగుబంట్లు, బర్రెలు పంపిన పుతిన్‌

Putin-Kim:  కిమ్‌కు  సింహం, ఎలుగుబంట్లు, బర్రెలు పంపిన  పుతిన్‌
X
రష్యాకు లక్ష ఉత్తర కొరియా బలగాలు!

రష్యా-ఉత్తర కొరియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా అధినేత కిమ్‌ (Kim Jong Un) పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. మరో లక్ష బలగాలను క్రెమ్లిన్‌కు పంపేందుకు కిమ్‌ అంగీకారం తెలిపారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న కిమ్‌కు పుతిన్‌ బహుమతులు పంపుతున్నారు.

ఇప్పటికే అరుదైన జాతి గుర్రాలు, శునకాలు, మేకల్ని పంపిన పుతిన్‌.. తాజాగా మరికొన్నింటిని గిఫ్ట్స్‌గా పంపారు. ఏకంగా 70కిపైగా జంతువులను బహుమతిగా పంపినట్లు తెలిసింది. ఇందులో ఒక ఆఫ్రికన్‌ సింహం, రెండు ఎలుగుబంట్లు, రెండు జడల బర్రెలు, ఐదు తెల్ల కోకాటూలు, 25 రకాల నెమల్లు, 40 మాండరిన్‌ బాతులు ఉన్నాయి. వీటన్నింటినీ ప్యాంగ్యాంగ్‌ సెంట్రల్‌ జూకు తరలించినట్లు తెలిసింది.

కాగా, కిమ్‌కు పుతిన్‌ ఇలా బహుమతులు పంపడం ఇదేమీ మొదటి సారి కాదు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇరు దేశాల అధినేతలు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటున్నారు. రెండేళ్ల క్రితం 30 ఒర్లావో ట్రోటర్‌ గుర్రాల్ని కిమ్‌కు అందజేశారు. కిమ్‌ ఈ ఏడాది జూన్‌లో పుతిన్‌కు అరుదైన శునకాల్ని బహుమతిగా పంపగా, పుతిన్‌ ఆగస్టులో కిమ్‌కు 447 మేకల్ని బహుమతిగా పంపారు.

తన మిత్రదేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్‌ అంగీకారం తెలిపారని తెలిసింది. దశలవారీగా వీరిని పంపనున్నట్టు సమాచారం. ఇప్పటికే రష్యాకు 15 వేల మంది ఉత్తరకొరియా సైనికులకు కిమ్‌ పంపారు. దీనిపై పొరుగుదేశమైన దక్షిణ కొరియా, అమెరికా అభ్యంతరాలు చెప్తున్నా ఆయన లెక్కచేయడం లేదు. కిమ్‌ చర్యలతో ఉక్రెయిన్‌, మిత్రదేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఈ చర్య ఇండో పసిఫిక్‌ రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.

Tags

Next Story