London : ఉద్యోగాల కోతకు వోడాఫోన్ సిద్ధం

ఉద్యోగుల కోతకు సిద్దమైంది ప్రముఖ టెలీకమ్యూనికేషన్ సంస్థ వోడాఫోన్. కాస్ట్ సేవింగ్స్ లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. లండన్ ఉద్యోగులకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి మందగమనంలో సాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రపపంచవ్యాప్తంగా వోడాఫోన్ కు ఒక లక్షా 4 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా... ఒక్క లండన్ లోనే 9వేల నాలుగు వందల మంది ఉన్నారు. 2026 నాటికి 1 బిలియన్ యూరోల ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగా... ఉద్యోగాల కోతకు సిద్దమైనట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
వోడాఫోన్ సీఈఓ (UK)నిక్ రీడ్ 2022 ముగింపులోనే కంపెనీ నుంచి బయటకు వచ్చారు. అతని స్థానంలో తాత్కాలికంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మార్గరీటా డెల్లా బాధ్యతలు చేపట్టారు. నిక్ రీడ్ డిసెంబర్ 31న గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరియు వోడాఫోన్ డైరెక్టర్ గానూ వైదొలిగారు. మార్చి 31, 2023వరకు బోర్డు సలహాదారుగా మాత్రమే ఉండనున్నారు. ప్రస్తుతం వోడాఫోన్ ఆపరేటింగ్ మాడల్ ను సమీక్షిస్తున్నట్లు, సమూహాన్ని క్రమబద్దీకరించడం మరియు సరలీకృతం చేయడంపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com