London: వెర్రి వేయి తలలు: నో ట్రౌజర్స్ డే
వెర్రి వేయి తలలు అంటారు. లండన్ సబ్ వే లో చోటు చేసుకున్న ఉదంతం చూస్తే ఇలానే అనిపిస్తుంది. ఫ్యాంట్లు వేసుకోవడం మరచిపోయిన ప్రయాణీకులతో ఓ సబ్ వే కిక్కిిరిసిపోయింది. అయితే ఇలా ప్యాంట్లు మరచిపోయింది ఒక్కరో ఇద్దరో కాదు... కొన్ని వందల మంది ఇలా అర్థనగ్నంగా కనిపించడమే విడ్డూరం.
'ది స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ' ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్యాంట్ లెస్ వ్యవహారం ప్రస్తుతం వైరల్ గా మారింది. విషయం ఏమిటంటే ప్రతీ ఏడాదీ మనోళ్లది ఇదే తంతు అట. కార్యక్రమంలో భాగంగా ప్రయాణీకులు ప్యాంట్లు లెకుండా సబ్ వే రైలు లో ప్రయాణించాలట. అయితే వారు సదరు క్లబ్ లో మెంబర్ షిప్ పొంది ఉండాలి. 'నో ట్రౌజర్స్ ట్యూబ్ రైడ్' పేరిట 2002లో ఈ సంప్రదయానికి శ్రీకారం చుట్టారట.
ఈ వింత కార్యక్రమానికి సబ్ వే అధికారుల మద్దతు కూడా తోడవ్వడంతో ప్రతీ ఏటా ఈ అర్థనగ్న ప్రదర్శన నిరాటంకంగా సాగిపోతోంది. ఇందులో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి.. సూటూ బూటూ వేసుకుని, చక్కగా టై కట్టుకుని ప్యాంటు సంగతి మత్రం మరచిపోవాలట. అబ్బాయిలు అయితే ప్యాంట్లు, అమ్మాయిలు అయితే స్కర్ట్ లు వేసుకోకూడదు.
అయితే ఈ అర్థనగ్న ప్రదర్శన వెనుక పెద్ద ఉద్దేశమే ఉండి ఉంటుందేమో అనుకునేరు. కేవలం సరదా కోసమే ఈ తంతగమంతా అంటూ ఓ సబ్ వే అధికారి స్పష్టం చేశారు. నిండుగా కప్పుకుని ప్రయాణించడంలో ఏముంది కిక్కూ... విప్పుకుని తిరగడంలోనే ఉందికదా అసలైన కంఫర్ట్ అంటున్నారు ఈ జనాలు. ఏమైనా... పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు మరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com