London: డర్టీ డాక్టర్‌.. మూడు జీవిత ఖైదులు...

London: డర్టీ డాక్టర్‌.. మూడు జీవిత ఖైదులు...
ఒకరు కాదు ఏకంగా 115 మందిపై లైంగిక దాడి; మూడు జీవిత ఖైదులు విధించిన కోర్టు; శిక్ష సరిపోదంటోన్న బాధితురాళ్లు

దేవుడు జన్మనిస్తే వైద్యుడు పునర్ జన్మనిస్తాడు అంటారు. కానీ కామంతో కన్నూ మిన్నూ తెలయకుండా ప్రవర్తించి ఆ వృత్తికే చెడ్డ పేరు తెచ్చాడు ఓ కీచకుడు.


భారత సంతతికి చెందిన డా. మనీష్‌ షా(53) ఈస్ట్‌ లండన్‌లోని రోమ్‌ఫోర్డ్‌ నగరంలో జీవీ క్లినిక్‌ నిర్వహిస్తుంటాడు. తన వద్దకు వచ్చిన మహిళా రోగులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చెకప్ పేరిట వారి శరీరాలను తాకుతూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు.


ఈ కీచక డాక్టర్ పై ఓ మహిళ కేసు పెట్టగా అతని గుట్టు రట్టు అయింది. ఆమె ఫిర్యాదు పై విచారణ చేపట్టిన పోలీసులు... అసలు చిట్టా బయటపడటంతో విస్తుపోయారు. తీగ లాగితే డొంక కదలినట్లు ఒకరు కాదు ఇద్దరూ కాదు 2009 నుంచి నాలుగేళ్ల క్రితం వరకు మొత్తం 90 మంది మహిళలను లైంగికంగా ఇబ్బంది పెట్టినట్లు వెల్లడైంది. గత నెల అక్కడి న్యాయస్థానం ఈ కీచక డాక్టర్‌కి మూడు జీవిత ఖైదులు విధించింది.


తాజాగా 15 నుంచి 34 మధ్య వయసుగల మరో 28 మంది మహిళలను అతడి బాధితులుగా గుర్తించారు. దీంతో మరో జీవిత ఖైదు విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.


షా నేరాలకు పాల్పడేందుకు క్యాన్సర్‌ రోగుల భయాన్ని వాడుకునేవాడు. ప్రముఖ సెలిబ్రీటీల పేర్లు చెప్పి మీకు కూడా అలాగే జరిగే అవాకాశం ఉందని భయపెట్టేవాడు. హాలీవుడ్ హీరోయిన్ ఏంజలీనా జోలీ పేరు చెప్పి అతనికి కావల్సింది చేయించేవాడు.


15,17 సంవత్సరాలు ఉన్న యువతులను లైంగికంగా వేధించిన కేసులో అతనికి మొదటి జీవిత ఖైదు పడింది. వారికి మాయ మాటలు చెప్పి మీరంటే నాకు అభిమానమని, మోడలింగ్‌ కు పనికి వస్తారంటూ మాయమాటలు చెప్పడమే కాదు, క్యాన్సర్‌ రావచ్చు అని భయపెట్టి వారిని లైంగికంగా వేధించినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.



Tags

Read MoreRead Less
Next Story