Louisiana shooting: లూసియానాలో కాల్పులు.10 మందిలో ఏడుగురు సొంత పిల్ల‌లే.

Louisiana shooting: లూసియానాలో కాల్పులు.10  మందిలో ఏడుగురు  సొంత  పిల్ల‌లే.
X
అమెరికాలో ఘోరం

అమెరికాలోని లూజియానా రాష్ట్రం శ్రీవ్‌పోర్ట్‌లో ఆదివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటన దేశాన్ని కలచివేసింది. 31 ఏళ్ల షామర్ ఎల్కిన్స్ అనే వ్యక్తి తన కుటుంబంపై తుపాకీతో కాల్పులు జరిపి మొత్తం 8 మంది చిన్నారులను హతమార్చాడు. ఇందులో ఏడుగురు అతని స్వంత పిల్లలే కావడం మరింత విషాదకరం. ప్రాథమిక సమాచారం ప్రకారం భార్యతో జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

నిద్రలోనే పిల్లలపై కాల్పులు

మృతిచెందిన చిన్నారుల వయసు 3 నుంచి 11 సంవత్సరాల మధ్యగా ఉంది. పిల్లలు నిద్రలో ఉండగానే తలకు గురి పెట్టి కాల్చినట్లు అధికారులు తెలిపారు. ఒకే ఇంట్లో ఏడుగురు చిన్నారుల మృతదేహాలు లభించగా, మరో చిన్నారి పారిపోతుండగా కాల్చబడింది. గోడ దూకి తప్పించుకున్న మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మహిళపై దాడి తర్వాత రెండో ఇంట్లో హత్యలు

దాడికి ముందు ఎల్కిన్స్ ఒక మహిళపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మరో ఇంట్లోకి వెళ్లి పిల్లలను హతమార్చాడు. మృతిచెందిన పిల్లల తల్లి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనను గృహహింస కేసుగా పోలీసులు పరిగణిస్తున్నారు.

నిందితుడి గత చరిత్ర, పోలీసుల ఎన్‌కౌంటర్

ఎల్కిన్స్ గతంలో కూడా ఆయుధ కేసులో అరెస్టైన వ్యక్తిగా గుర్తించారు. తాజాగా జరిగిన ఘటన తర్వాత పోలీసులు అతనిపై కాల్పులు జరిపి హతమార్చారు. అతను లూజియానా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసినట్లు సమాచారం. ఈ ఘటన అమెరికాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత దారుణ కుటుంబ హింస ఘటనల్లో ఒకటిగా నిలిచింది.

Tags

Next Story