Lunar Eclipse: భారత్‌లో పూర్తిస్థాయి చంద్ర గ్రహణం..

Lunar Eclipse: ప్రపంచ వ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం అయ్యింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట 30నిమిషాల నుంచి ప్రపంచంలోని పలు దేశాల్లో చంద్రగ్రహణం మొదలైయ్యింది. చంద్రగ్రహణం భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుంది. అయితే భారత్‌లో పూర్తిస్థాయి గ్రహణం సాయంత్రం 5గంటల 32నిమిషాల నుంచి సాయంత్రం 6గంటల 18నిమిషాల వరకు కనిపిస్తుంది.
ఈ ఏడాది చిట్టచివరి చంద్రగ్రహణం కార్తీక పౌర్ణమి రోజు రావడం.. సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజుల్లోనే చంద్రగ్రహణం కనువిందు చేయడం విశేషం. కాగా.. కోల్‌కతాలో సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తిస్థాయిలో వీక్షించవచ్చు. హైదరాబాద్ లో సాయంత్రం 5గంటల 44నిమిషాల నుంచి 6గంటల 18నిమిషాల వరకు చంద్రగ్రహణం కనిపించనుంది.
ఇక చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, ఎటువంటి పరికరాలు అవసరం లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వాతావరణం అనుకూలిస్తే పూర్తిస్థాయిలో ఎర్రగా మారిన చంద్రుడిని చూడొచ్చన్నారు. చంద్రగ్రహణం భారత్‌తోపాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కనిపించనుంది.
ఇక మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటానికి మూడేళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2025 మార్చి 14న వరకు సంపూర్ణ చంద్రగ్రహణాలు ఉండవని నాసా తెలిపింది .ఇంత సుదీర్ఘకాల చంద్ర గ్రహణం ఏర్పడటం 580 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారని శాస్త్రవేత్తలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com