France: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్

France: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్
ముందస్తు ఎన్నికలు ముగిసిన 2 నెలల తర్వాత ఎంపిక

ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నికయ్యారు. ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికలు ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. మిచెల్ బార్నియర్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. యూరోపియన్ యూనియన్ యొక్క మాజీ చీఫ్ బ్రెక్సిట్ సంధానకర్త అయిన బార్నియర్ వివిధ ఫ్రెంచ్ ప్రభుత్వాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈయూ కమిషనర్‌గా కూడా పని చేశారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం మిచెల్ బార్నియర్‌(70)ను దేశ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ సమాచారం అందింది. దేశానికి, ఫ్రాన్స్‌కు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యత బార్నియర్‌కు ఉందని ప్రకటన పేర్కొంది. బార్నియర్ 2016 నుంచి 2021 వరకు యూరోపియన్ యూనియన్ (EU) నుండి బ్రిటన్ నిష్క్రమణ చర్చలకు నాయకత్వం వహించారు.

బార్నియర్ జూన్ 9, 1951న జన్మించారు. ఫ్రాన్స్ సంప్రదాయవాద పార్టీ లెస్ రిపబ్లికయిన్స్ (LR) నాయకుడు. సోవాయి జిల్లా నుంచి గెలుపొంది 27 ఏళ్ల వయసులో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అనంతరం అయన ఫ్రాన్స్ పర్యావరణ మంత్రి, యూరోప్ మంత్రి అయ్యారు. ఈయూ ప్రాంతీయ విధాన కమిషనర్, విదేశాంగ మంత్రి, వ్యవసాయ మంత్రి, EU కమిషనర్ వంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు.

Tags

Next Story