కాలిఫోర్నియాలో భూకంపం

కాలిఫోర్నియాలో భూకంపం
రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదు

గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. సోమవారం ఉదయం భూకంపం సంభవించిన కొద్దిసేపటికే యూఎస్ వెస్ట్ కోస్ట్, బ్రిటిష్ కొలంబియా లేదా అలాస్కాకు సునామీ ప్రమాదం లేదని యూఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. మెక్సికో సివిల్ డిఫెన్స్ కార్యాలయం భూకంపం సంభవించిన ప్రాంతాల్లో జరిగిన నష్టంపై ఆరా తీస్తోంది. అయితే ఈ పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికి ఓడరేవులలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున పడవల విషయం లోనూ, సమీపంలోని తీరప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించి నట్టుగా సమాచారం. భూకంపం సంభవించిన ప్రాంతంలో సముద్రపు నీటి మట్టాలలో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉండవచ్చని మెక్సికన్ పౌర రక్షణ కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలు రాగానే జనం భయంతో పరుగులు తీశారు.

ఉత్తర కాలిఫోర్నియాలో గత నెలలో సంభావించిన భూకంపం తీవ్రత 5.5 గా నమోదు అయ్యింది. ఇక గత సంవత్సరం డిసెంబరులో కూడా 6.4 తీవ్రతతో రిక్టర్ స్కేలుపై భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు.

Tags

Next Story