Talibans : అసలు ఈ నలుగురు లేకపోతే తాలిబన్లే లేరు..!

అఫ్గానిస్థాన్‌పై తాలిబన్లు పూర్తిస్థాయిలో పట్టుసాధించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ని వారు హస్తగతం చేసుకున్నారు.. దీనితో అఫ్గన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభమైంది.ఈ దఫా తాలిబన్ల నాయకత్వంలో ఈ నలుగురే కీలక పాత్ర పోషించనట్లుగా తెలుస్తుంది. ఆ నలుగురే ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్, హైబతుల్లా అఖుంజాదా, సిరాజుద్దీన్ హక్కానీ, ముల్లా యాకూబ్...
ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్ : తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు
1994లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ఉద్యమాన్ని స్థాపించిన నలుగురిలో ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్ ఒకరు. 53 ఏళ్ల ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్ 1968 లో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉరుజ్గాన్ ప్రావిన్స్‌లోని డెహ్రావుడ్ జిల్లాలోని వీట్‌మాక్ గ్రామంలో జన్మించాడు. కాందహార్ నగరంలో పెరిగారు.. ఇక్కడే తాలిబన్ల ఉద్యమం మొదలైంది. ముల్లా మహమ్మద్ ఒమర్‌తో కలిసి 1990లో తాలిబన్ల ఉద్యమం చేపట్టారు. 2010లో పాకిస్థాన్ ఇంటర్‌సర్వీస్ ఇంటలిజన్స్ (ఐఎస్‌ఐ), సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) బృందాలు ఇతనిని అరెస్టు చేశాయి. అనంతరం 2018లో అక్టోబర్‌లో విడుదలయ్యాడు. అమెరికన్ లతో కీలక చర్చలు ఈయనే నిర్వహించేవాడు.
హైబతుల్లా అఖుంజాదా :
తాలిబన్ల ప్రధాన నాయకులలో హైబతుల్లా అఖుంజాదా ఒకరు. దాదాపు 60 ఏళ్ల వయసున్న ఈ హైబతుల్లా అఖుంజాదా మతం పట్ల నిష్ట కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు. మతపర వ్యవహరాలకు అధిపతి కూడా.. 2016లో అఫ్గాన్–పాకిస్తాన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన అఖ్తర్ మన్సూర్ నుంచి అతడు ఈ బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు పాకిస్తాలోని కుచ్లాక్‌లో ఓ మసీదులో మత గురువుగా పనిచేశాడు.
సిరాజుద్దీన్ హక్కానీ :
పాక్ కేంద్రంగా పనిచేసే హక్కానీ నెట్‌వర్క్ కి ఇతనే నాయకుడు. తాలిబన్ ఆర్థిక, సైనిక వ్యవహారాలు, నిధుల సేకరణ, పంపిణీ వంటివి ఇతడి కనుసన్నల్లోనే సాగుతుంటాయి. కొన్నేళ్లుగా కాబుల్‌లోని తీవ్రమైన దాడులన్నీ ఈ సంస్థ సారథ్యంలో జరిగినవే. సిరాజుద్దీన్ వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. సోవియట్ వ్యతిరేక ముజాహిదీన్ కమాండర్ జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే సిరాజుద్దీన్ హక్కానీ.
ముల్లా యాకూబ్ :
తాలిబన్ల వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడే ఈ ముల్లా యాకూబ్. తాలిబన్ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షిస్తుంటాడు. ప్రస్తుతం అతడికి దాదాపు 30 ఏళ్ల వయసుంటుందని సమాచారం.భవిష్యత్తులో అప్ఘానిస్తాన్ కి ఇతనే సారథ్యం వహించవచ్చని తెలుస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com