- Home
- /
- అంతర్జాతీయం
- /
- సిడ్నీలో భారీ అగ్ని ప్రమాదం.....
సిడ్నీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడంతస్తుల భవనంలో మంటలు

By - Prasanna |25 May 2023 9:47 AM GMT
ఆస్ట్రేలియా సిడ్నీలోని ఏడంతస్తుల భవనాన్ని భారీ అగ్నిప్రమాదం చుట్టుముట్టింది. మంటలు మరింత వ్యాపించడంతో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు.
ఆస్ట్రేలియా సిడ్నీలోని ఏడంతస్తుల భవనాన్ని భారీ అగ్నిప్రమాదం చుట్టుముట్టింది. మంటలు మరింత వ్యాపించడంతో రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు.సర్రీ హిల్స్‌లోని రాండిల్ స్ట్రీట్‌లో ఉన్న ఏడంతస్తుల భవనంలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. గంటల వ్యవధిలో మంటలు భవనం అంతా వ్యాపించాయి. సమీపంలోని పలు నివాస భవనాలకు భారీ మంటలు వ్యాపించాయి.దట్టమైన పొగలు కమ్ముకున్న భవనంలోని భాగాలు కూలిపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు, సైట్ చుట్టూ ఉన్న రహదారులను మూసివేశారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 100కు పైగా అగ్నిమాపక సిబ్బంది, 20 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com