Malala Yousafzai : నేను పెళ్ళికి వ్యతిరేకిని కాదు... !

Malala Yousafzai : నేను పెళ్ళికి వ్యతిరేకిని కాదు... !
Malala Yousafzai : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌‌జాయ్‌‌ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

Malala Yousafzai : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌‌జాయ్‌‌ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కి చెందిన అస‌ర్ మాలిక్‌ తో ఆమె వివాహం జరిగింది. వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలను మలాలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే పెళ్లి విషయంలో ఓ ఇంటర్వ్యూలో మలాలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపైన తాజాగా స్పందించింది మాలలా.. తానెప్పుడూ పెళ్ళికి వ్యతిరేకిని కాదని ఆమె చెప్పుకొచ్చింది. పితృస్వామ్య వ్యవస్థ, కొందరిలో మహిళల పట్ల ద్వేషభావన తదితర కారణాలతోనే పెళ్లి విషయంలో ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించారు. బాల్యవివాహంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఎలా రాజీపడుతున్నారని అన్నారు. ఈ ఆచారం విషయంలో జాగ్రత్తగా ఉండేలా చేశాయని తెలిపారు. వ్యవస్థను ప్రశ్నించాలి అంటూ తెలిపారు. ఇక తన భర్త అస‌ర్ మాలిక్‌ ని ప్రశంసలతో ముంచెత్తారు. తన విలువలను అర్ధం చేసుకునే భర్త దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా ఆమె తెలిపారు. కాగా 2014లో మలాలాకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

Tags

Next Story