Malala Yousafzai: నోబెల్ ప్రైజ్ విజేత మలాలా పెళ్లి.. ఏ ఆర్భాటం లేకుండా..

Malala Yousafzai (tv5news.in)
X

Malala Yousafzai (tv5news.in)

Malala Yousafzai: తన సామాజిక సేవలతో ఎంతో పేరు తెచ్చుకున్న మలాలా.. ఇటీవల పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను మొదలుపెట్టారు.

Malala Yousafzai: ఆడపిల్లలు అన్నింటిలో సమానం అని కొందరు సర్టిఫికెట్ ఇచ్చేస్తుంటే.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆడపిల్లను స్కులుకు పంపడానికి కూడా వెనకాడుతున్నారు. అలాంటి ఆడపిల్లలకు తోడుగా ఎంతోమంది మహిళలు పోరాటం చేశారు.. ఇంకా చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు మలాలా. తన సామాజిక సేవలతో ఎంతో పేరు తెచ్చుకున్న మలాలా.. ఇటీవల పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను మొదలుపెట్టారు.

ఆడపిల్లల చదువు కోసం పోరాటం చేయడమే కాదు.. అది కుదరదు అన్న చెప్పినవారికి ఎదురెళ్లడంతో బుల్లెట్‌ గాయాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది మలాలా. అయినా తన పోరాటం ఆపకపోవడంతో ప్రభుత్వం తన సేవలను గుర్తించి నోబెల్ పురస్కారాన్ని కూడా అందించింది. అప్పటి నుండి మొదలయిన తన పోరాటం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ పోరాటంలో తనకు వ్యక్తిగతంగా ఒక మనిషి తోడయ్యాడు.

బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌‌లోని మలాలా నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అస్సర్‌ను పెళ్లి చేసుకుంది మలాలా. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయిన ఈ పెళ్లి గురించి మలాలా తన సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేసింది.

''ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్‌, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం'' అని మలాలా ట్వీ్ట్ చేసి తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.

Tags

Next Story