Gold Mine: మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి

Gold Mine: మాలిలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి
X
మాలిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషాదం

మాలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 73మందికిపైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బంగారు గని కుప్పకూలిన సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు మాలి చాంబర్ ఆఫ్ మైన్స్ అధ్యక్షుడు అబ్దులయే పోనా వెల్లడించారు. గని వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆఫ్రియాలోని మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. మారుమూల ప్రాంతాలలో భద్రతా చర్యలను పాటించకుండా, అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతుండడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. దీంతో గోల్డ్ మైన్స్ తవ్వే సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తరచుగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. అధికారులు భద్రతా చర్యలను విస్మరిస్తున్నారని తరచుగా ఆరోపిస్తున్నారు.అయితే.. ఈసారిభారీ ప్రమాదం చోటు చేసుకుంది. తాజా సంఘటనపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఈ దారుణ ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉన్నట్లు వెల్లడించారు. బంగారు గని కుప్పకూలిన సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు.. గనిలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. మైనింగ్ ప్రాంతాలకు సమీపంలో నివసించే మైనర్లు, ప్రజలు భద్రతా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.


ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్న మాలి, ఆఫ్రికాలో బంగారు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మాలి 2022లో 72.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ లోహం జాతీయ బడ్జెట్ లో 25శాతం, ఎగుమతి ఆదాయాల్లో 75శాతం. 2023లో దాని జీడీపీలో 10శాతం దోహదపడిందని గతేడాది మార్చిలో అప్పటి గనుల శాఖ మంత్రి లామైన్ సేదౌ ట్రారే చెప్పారు. ఈ దేశంలో 10శాతం కంటే ఎక్కువ మంది తమ ఆదాయంకోసం మైనింగ్ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.


Tags

Next Story