ఇలా కూడా చేస్తారా.. ప్యాంట్‌లో కొండచిలువను పెట్టుకుని..
చిన్న పురుగు ఒంటి మీద పాకితేనే చీదరగా ఉంటుంది. అలాంటిది ఓ కొండ చిలువను ఎంచక్కా ప్యాంట్ లోపల పెట్టుకున్నాడు. ఎవరూ తనని గమనించట్లేదని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి చెక్కేశాడు ఓ మహానుభావుడు. అమెరికాలోని మిచిగాన్ ఏరియాలోని ఓ వ్యక్తి పాముల బిజినెస్ చేస్తున్నాడు. అందుకోసం ఏకంగా ఓ షోరూమ్‌నే ఏర్పాటు చేశాడు.
అద్దాల బాక్సుల్లో అందంగా పాములను ఉంచాడు. అందులో మరింత అందంగా కనిపిస్తోంది తెల్లగా మెరిసిపోతూ ఉన్న ఓ కొండ చిలువ. అంతే.. దాన్ని చూడగానే మనోడికి మనసైంది. వెంటనే ఆ బాక్స్ మీద ఉన్న రేట్ ట్యాగ్ చూసాడు. అందుబాటులో లేని ధర. కానీ అందంగా ముద్దుగా ఉన్న కొండ చిలువ.
ఏం చేయాలో ఓ నిమిషం అర్థం కాలేదు. అక్కడ చూడబోతే ఎవరూ లేరు. ఎక్కడో కౌంటర్‌లో మేనేజర్ ఉన్నాడు. కొట్టేసినా అడిగేవాడు లేడని ఓ నిర్ణయానికి వచ్చాడు. వెంటనే ప్యాంట్‌లోకి కొండ చిలువని జార విడిచాడు. అటు ఇటూ చూసి హ్యాపీగా అక్కడ నుంచి జంప్ అయ్యాడు. అయితే బాక్స్‌లో పైథాన్ లేని విషయాన్ని షాప్ ఓనర్ తీరిగ్గా గుర్తించాడు.
సీసీ కెమెరాను పరిశీలిస్తే అసలు విషయం బయటపడింది. రేటెక్కువైనా బావుందని షాపు ఓనర్ కూడా అంతకు ముందు రోజే తీసుకు వచ్చి పెట్టాడట. అది కాస్తా ఇలా చోరీకి గురయ్యింది. పైథాన్ పోయిందంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు షాపు ఓనర్. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ సర్ప ప్రేమికుడిని వెతికే పనిలో పడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com