Viral Video: మాజీ ప్రియురాలి మనసు గెలుచుకోవడం కోసం మోకాళ్లపై 21 గంటలు..

viral video: ప్రేమికుల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినా అవి దాదాపుగా ఆ బంధాన్ని తెంచుకునే వరకు వెళ్లవు.. కానీ ఒక్కోసారి సమస్య తీవ్రంగా ఉంటే సదరు వ్యక్తిని క్షమించలేరు. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. అప్పటి వరకు నేను కోసమే నేను అనుకున్నవాళ్లు కాస్తా నీ మొహం నాకు చూపించకు అనుకునే వరకు వెళతారు. ఇదిగో ఇక్కడ చైనాకు చెందిన ప్రేమికుడి పరిస్థితి కూడా అదే. వర్షం వచ్చినా, చలికి ఒణుకుతున్నా మాజీ ప్రియురాలి మనసు కరగలేదు. తన మాజీ ప్రియురాలి కార్యాలయం వెలుపల వర్షంలో మోకాళ్లపై 21 గంటలు గడిపాడు. విడిపోవడం అనేది ఒక తీవ్రమైన, బాధాకరమైన అనుభవం. తన మాజీ ప్రియురాలిని వదులు కోవడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు. అతను ఆమె ప్రేమను తిరిగి పొందాలనుకున్నాడు. ఆ వ్యక్తి మార్చి 28 మధ్యాహ్నం 1 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు 21 గంటల పాటు దాజౌలోని భవనం ప్రవేశ ద్వారం వెలుపల మోకాళ్ల మీద కూర్చున్నాడు. జోరున వర్షం పడుతున్నా, చలికి వణుకుతున్నా చేతిలో పూల గుత్తి పట్టుకుని ఆమె కోసం ఎదురు చూశాడు. కానీ ఆమె మనసు కరగలేదు. బయటకు రాలేదు. ఇంతలో, స్థానికులు అతని చుట్టూ గుమిగూడారు. అతని ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. ఇంత హంగామా చేసినా అతడి మాజీ ప్రియురాలు కనిపించలేదు.పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని వారించారు. ‘నేను ఇక్కడ మోకరిల్లడం చట్ట విరుద్ధం కాకపోతే నన్ను వదిలేయండి అని అన్నాడు. దాంతో చేసేదేం లేక పోలీసులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన్ని రోజుల క్రితం తన మాజీ ప్రియురాలు తన నుంచి విడిపోయిందని, అందుకే ఇప్పుడు క్షమించమని కోరుతున్నానని పోలీసులకు వివరించాడు.. 21 గంటలు గడిచినా ప్రియురాలు కనికరించకపోవడంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com