Bird flu death: ప్రపంచంలో బర్డ్ ఫ్లూతో తొలి మృతి నమోదు..

ఏప్రిల్ 24న రోగి మరణించినట్టు ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ

మనుషుల్లో ముందెన్నడూ కనిపించని హెచ్‌5ఎన్‌2 బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల ఓ మెక్సికో దేశస్థుడు మరణించాడని బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ఏప్రిల్‌ 24న అతడు అనారోగ్యంతో చనిపోయాడని.. ఆ వ్యక్తికి ఆ వైరస్‌ ఎలా సోకిందో తెలియదని వెల్లడించలేదు. ఒక పౌల్ట్రీ ద్వారా అది వ్యాపించి ఉండొచ్చని తెలిపింది. మనిషి ద్వారా వ్యాపించడం వల్లే సదరు వ్యక్తి మరణించాడనడానికి ఆధారాలు లేవని మెక్సికో వైద్యశాఖ పేర్కొంది. మనుషుల్లో ఈ వైరస్‌ వ్యాప్తి జరగకుండా శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. మెక్సికోలో మార్చిలోనే బర్డ్‌ ఫ్లూ కేసులను గుర్తించారు. బాధితుడు బర్డ్ ఫ్లూ బారిన పడ్డ విషయాన్ని మెక్సికో అధికారులు మే 23న ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు.

రోగికి వ్యాధి ఎలా సోకిందనే దానిపై సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, మెక్సికోలోని కోళ్లల్లో హెచ్5ఎన్2 ఇన్ఫెక్షన్లు వెలుగు చూసినట్టు పేర్కొంది. మరి, కోళ్ల నుంచి మనిషికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో నిర్ధారించడం కష్టంగా మారిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇప్పటివరకూ ఈ వేరియంట్ మనుషులకు సోకడం దాదాపు అసాధ్యంగా భావించినట్టు పేర్కొంది. మరోవైపు, అమెరికాలో బర్డ్ ఫ్లూకు చెందిన మరో వేరియంట్ వ్యాపిస్తోంది. పశువుల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. కొందరు మనుషులు కూడా దీని బారినపడ్డట్టు తెలుస్తోంది. అయితే, ఇది రోగుల నుంచి ఇతరులకు వ్యాపిస్తోందనేందుకు ఇంతవరకూ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు. అటు అమెరికాలో ఇప్పటి వరకూ మూడు బర్డ్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీళ్లలో ఇద్దరిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. మూడో వ్యక్తిలో శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యాయి.

Tags

Next Story