లక్కు బావుంది.. ఆర్డర్ ఇచ్చింది ఒకటి.. వచ్చింది మరొకటి

లక్కు బావుంది.. ఆర్డర్ ఇచ్చింది ఒకటి.. వచ్చింది మరొకటి
ఖరీదైన ఆపిల్ ఫోన్ వస్తే కంప్లైంట్‌తో పనేముంది అంటూ ఆనందంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అదృష్టం ఐఫోన్ రూపంలో తలుపు తట్టింది. ఇప్పటి వరకు ఖరీదైన వస్తువులు ఆర్డర్ ఇస్తే చీఫ్ వస్తువులు రావడం చూశాము. కానీ అందుకు విరుద్దంగా ఆన్‌లైన్‌లో ఆపిల్ పండ్లు బుక్ చేస్తే ఆపిల్ ఐఫోన్ వచ్చింది. ఫోన్ చూసి అవాక్కయ్యారు ట్వికెన్‌హామ్‌కు చెందిన 50 ఏళ్ల నిక్ జేమ్స్.

ఇచ్చింది ఒకటి వచ్చింది ఒకటి అని కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చే పన్లేదు. ఖరీదైన ఆపిల్ ఫోన్ వస్తే కంప్లైంట్‌తో పనేముంది అంటూ ఆనందంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది.

కరోనా వైరస్ వచ్చి ప్రతి ఒక్కరినీ ఆన్‌లైన్‌కు మరింత దగ్గర చేసింది. ఇల్లు కదిలే పని లేకుండా అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం. ఈ క్రమంలోనే బ్రిటన్‌కు చెందిన జేమ్స్ ఆపిల్ పండ్ల కోసం సూపర్ మార్కెట్‌కు ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఆపిల్ పండ్లతో పాటు ఆపిల్ ఐఫోన్ కూడా రావడంతో ఎగిరి గంతేశాడు.

కానీ ఈస్టర్ సందర్భంగా ఏదైనా ఫ్రాంక్ చేశారేమో అని అనుమానించాడు. లక్కు బావుంది.. ఆర్డర్ ఇచ్చింది ఒకటి.. వచ్చింది మరొకటిటెస్కో మార్కెట్ కంపెనీ అతడి ఇచ్చిన సర్‌ఫ్రైజ్ గిప్ట్ అది అని తెలుసుకుని ఆనందించాడు. సూపర్ సబ్‌స్టిట్యూట్‌లో రెగ్యులర్‌గా వస్తువులు కొనుగోలు చేసే వినియోగదారులకు ఆపిల్ ఐఫోన్లు, ఎయిర్ పాడ్స్‌‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతులుగా అందిస్తోందట టెస్కో సంస్థ.

Tags

Read MoreRead Less
Next Story