అంతర్జాతీయం

పోలీస్ అధికారి.. డెలివరీ బాయ్‌గా మారి కబాబ్‌ని కస్టమర్‌కి అందిస్తూ..

పోలీస్ వచ్చి కస్టమర్‌కి పార్శిల్ అందించడంతో అతడు ఖంగుతిన్నాడు..

పోలీస్ అధికారి.. డెలివరీ బాయ్‌గా మారి కబాబ్‌ని కస్టమర్‌కి అందిస్తూ..
X

పోలీసులకు పార్ట్ టైమ్ జాబ్ చేయాల్సినంత ఖర్మ ఏంటి.. జీతం కంటే గీతం ఎక్కువే వస్తుందిగా.. అది కూడా చాలట్లేదా ఏంటి.. డెలివరీ బాయ్ అవతారం ఎత్తడం ఏంటో.. ఇంతకీ ఇది ఏ సినిమాలోనో సినో కాదు కదా.. మీరు చదివేది నిజమే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బెర్క్‌షైర్‌లోని వుడ్లీలో నివసిస్తున్న ఒక వ్యక్తి ఆన్‌లైన్లో కబాబ్‌‌లు ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో ఓ పోలీస్ వచ్చి కస్టమర్‌కి పార్శిల్ అందించడంతో అతడు ఖంగుతిన్నాడు..

ఆసక్తికరమైన ఈ సంఘటన వెనుక కారణం ఏమిటంటే, సరైన భద్రతా చర్యలు లేకుండా డెలివరీ బాయ్ నడుపుతున్న వాహనాన్ని పోలీస్ పట్టుకున్నారు. క్యారీ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా వాహనాన్ని రోడ్డెక్కించాడు. కారు టైర్ కూడా కండిషన్లో లేదు. అన్నింటికంటే దారుణం అతడు పార్శిల్‌ని డెలివరీ చేయడానికి బయలుదేరినప్పుడు డ్రగ్స్ తీసుకొని ఉన్నాడు.. ఒకటి రెండు కాదు ఇన్ని కారణాలతో అతడిని పోలీస్ పట్టుకున్నారు.

పోలీసింగ్ బృందానికి డ్రైవర్‌ను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఏదేమైనా, అరెస్టు చేసిన తరువాత వారు కారులో ఉన్న ఆహార ప్యాకేజీని గమనించారు. ఫుడ్ డెలివరీ చేసే బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసు బృందం కబాబ్‌ను కస్టమర్ చిరునామాకు అందించాలని నిర్ణయించుకున్నారు.

నాలుగిళ్ల అవతలే ఉన్న కస్టమర్ ఇంటికి పోలీస్ వెళ్లి చిరునవ్వుతో పార్శిల్ అందించారు. పార్శిల్ అందుకున్న కస్టమర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

వినోదభరితమైన ఈ వార్తకు వినియోగదారుల నుండి అనేక వందల ప్రశంసలు దక్కాయి. చాలా మంది నెటిజన్లు పోలీసుల పని తీరును ప్రశంసిస్తున్నారు

Next Story

RELATED STORIES