ఎయిర్ పోర్ట్ అనౌన్స్ మెంట్ లో పెళ్లి ప్రపోజల్..

ఎయిర్ పోర్ట్ అనౌన్స్ మెంట్ లో పెళ్లి ప్రపోజల్..
ఇప్పుడంతా ఇదే ట్రెండ్.. కొత్తగా చెయ్యాలి. అందరి చూపు తమ వైపు తిప్పుకోవాలి.

ఇప్పుడంతా ఇదే ట్రెండ్.. కొత్తగా చెయ్యాలి. అందరి చూపు తమ వైపు తిప్పుకోవాలి. తమ ప్రియురాలికి లవ్ ప్రపోజల్ లేదా పెళ్లి ప్రపోజల్ సరికొత్తగా చెప్పాలి. అందుకు ఓ మాంచి ఐడియా ప్లాన్ చేయాలి. అది క్రికెట్ స్టేడియం కావచ్చు లేదా ఎయిర్ పోర్ట్ కూడా కావచ్చు. అంతకంటే కొత్తగా ఆలోచించాడు ఆక్లాండ్ కు చెందిన ఓ యువకుడు. తన ప్రియురాలికి మ్యారేజ్ ప్రపోజల్ ఎయిర్ పోర్ట్ అనౌన్స్ మెంట్ ద్వారా చేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఆమె ఫిదా అయిపోయింది.

యష్‌రాజ్ ఛబ్రా తన ప్రణాళికను ఆచరణలో పెట్టడానికి ముందు భయపడ్డాడు. కానీ ఎలా అయినా సరే చెయ్యాలనుకున్నాడు. దానిని అమలు చేయడానికి విమానాశ్రయ సిబ్బంది సహాయం తీసుకున్నాడు.

యష్రాజ్ ఛబ్రా ఆగస్టు 18న తన స్నేహితురాలు రియా శుక్లాకు ప్రపోజ్ చేయడానికి వేలాది మంది ప్రజల ముందు ఒక మోకాలిపైన నిలబడి తన ప్రేమను ప్రకటించాడు. తన భాగస్వామికి తన ప్రేమను ప్రకటించడానికి, ఆమెను వివాహం చేసుకోమని కోరడానికి అనౌన్స్ మెంట్ సహాయాన్ని తీసుకున్నాడు.

ఆక్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్ స్పెషలిస్ట్ అయిన Mr ఛబ్రా, తన స్నేహితురాలు ఎప్పటికీ మర్చిపోలేని పనిని చేయాలనుకున్నాడు.Ms శుక్లా ఆక్లాండ్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆమె మెల్‌బోర్న్ నుండి ఆక్లాండ్ వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసినప్పుడు, అతను ఈ ప్రణాళికను రూపొందించాడు.

"ఆమెను ఆశ్చర్యపరచడం చాలా కష్టం. అంత త్వరగా నమ్మదు. అయితే తన ప్లాన్ నిజంగా వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. అయినా ప్రయత్నించాలనుకున్నాడు. విమానాశ్రయ సిబ్బంది సహకారంతో తన కల నిజం చేసుకున్నానని సంతోషంగా చెబుతున్నాడు ఛబ్రా.

మొత్తం ప్రతిపాదనను ప్రొఫెషనల్ సిబ్బంది కెమెరాలో బంధించారు. విమానాశ్రయం యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసారు. దీనికోసం ఒక నెల కష్టపడ్డానని ఛబ్రా చెప్పారు.

Tags

Next Story