USA: జో బైడెన్ బెదిరించి.. కాల్పుల్లో హతమయ్యాడు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను, మాన్‌మట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్‌లను చంపుతానని ఫేస్‌బుక్‌లో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ఎఫ్‌బీఐ అంతం చేసింది. నిందితుడు క్రెయిగ్ రాబర్ట్‌సన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. ‘బైడెన్, యూటాకు వస్తున్నట్లు తనకు తెలిసిందని, ఇందుకోసం తన గిలీ సూట్‌తో పాటు ఎం24 స్నైపర్ రైఫిల్ దుమ్మును శుభ్రం చేస్తున్నా’ అంటూ పోస్ట్ చేయడమే కాదు గన్ ఫొటోలను కూడా క్రెయిగ్ పంచుకున్నారు. దీంతో యూటా రాష్ట్రంలో అధ్యక్షుడు జో బైడెన్ పర్యటనకు కొన్ని గంటల ముందుగా ఎఫ్‌బీఐ అధికారులు క్రెయిగ్ రాబర్ట్‌సన్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎఫ్‌బీఐ ఇంకా విడుదల చేయలేదు. కానీ నిందితుడిని సజీవంగా పట్టుకోవడానికి తమ ప్రయత్నించామని అయితే అతను ఎఫ్‌బీఐ దాడిలో చనిపోయాడని మాత్రం ప్రకటించారు. నిందితుడు ఇప్పటికే చాలా రోజులనుండి డజన్ల కొద్ది బెదిరింపు మెసేజ్‌లను, ఆయుధాల ఫొటోలను ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు. బయట ఎంతో సహా ఉపాధ్యక్షురాలు కమలహారిస్, అటార్నీ జనరల్ మెరిట్ గార్ల్యాండ్ లాంటి ప్రముఖులపై కూడా కూడా సామాజిక మధ్యమాలలో బెదిరింపులకు పాల్పడ్డాడు.

గతంలో కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఇలాంటి బెదిరింపులు చాలానే వచ్చాయి. ముఖ్యంగా బైడెన్ ను చంపుతానంటూ ట్రక్కుతో వెళ్లి శ్వేతసౌధం బారికేడ్లను ఢీకొన్నాడు ఒక భారత సంతతి వ్యక్తి. అతనిని నిర్బంధించిన భద్రతా సిబ్బంది ఫెడరల్ కోర్టు జడ్జి ముందు అతణ్ని హాజరు పరిచారు. 19 సంవత్సరాల వర్షిత్ కు పదేళ్ల జైలుశిక్ష.. అలాగే రూ.2 కోట్లు జరిమానా విధించినట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com