Manpreet Monica Singh: యూఎస్ కోర్టులో భారత సంతతి మహిళ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం

Manpreet Monica Singh: అవకాశం రావాలే కానీ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. భారత సంతతికి చెందిన మన్‌ప్రీత్ మోనికా సింగ్ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో మొదటి మహిళా సిక్కు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి మన దేశానికి గర్వ కారణంగా నిలిచారు.
సివిల్ కోర్టు న్యాయమూర్తిగా హారిస్ కౌంటీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం 'నిజమైన గౌరవం' గా భావిస్తున్నానని పేర్కొన్నారు. దీన్ని ఒక చారిత్రాత్మక ఘట్టంగా మార్చినందుకు అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. "నా 2 దశాబ్దాల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆమె అన్నారు.
మన్‌ప్రీత్ మోనికా సింగ్ గురించి..
1970లో మన్‌ప్రీత్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. మన్‌ప్రీత్ హ్యూస్టన్‌లో పుట్టి పెరిగింది. ఆమె ప్రస్తుతం తన భర్త, ఇద్దరు పిల్లలతో బెలైర్లో నివసిస్తున్నారు. 20 ఏళ్లుగా అటార్నీగా పని చేశారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పౌర హక్కుల సంస్థల్లో చురుగ్గా పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com