Marburg virus : పంజా విసురుతున్న మార్ బర్గ్ వైరస్

ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారిని మరిచిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మరో వైరస్ మహమ్మారి కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారుతోంది. వెస్ట్ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన 'మార్ బర్గ్ వైరస్' కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ అయ్యింది.మధ్య ఆఫ్రికాలో ఎబోలా లాంటి వైరస్ వ్యాప్తి గురించి చర్చించడానికి W.H.O అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.ఓ నివేదిక ప్రకారం,గినియాలో ఈ వైరస్ తో తొమ్మిది మంది మరణించారు. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు.
మరోవైపు వైరస్ ప్రాణాంతకమని W.H.O హెచ్చరించింది. ఈ వైరస్ చాలా వేగంగా విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇది గాలి ద్వారా వ్యాపించదని. వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, రక్తం, ఇతర శరీర ద్రవాల ద్వారా మార్ బర్గ్ వైరస్ వ్యాపిస్తుందని.వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల నుంచి కూడా ఈ వైరస్ మనుషులకు సోకుతుందని W.H.O హెచ్చరించింది.
ఇక ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రంగా జ్వరం,తలనొప్పి ఉంటాయి. శరీరంలో అంతర్గతంగా రక్త స్రావం జరుగుతుంది. వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాయి. చికిత్స చేయడంలో ఏ మాత్రం జాప్యం జరిగినా ప్రాణాలకు ప్రమాదంగా పరిణమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com