Zuckerberg: రూ.245 కోట్లకు ఇల్లు అమ్మిన జుకర్ బర్గ్

Zuckerberg: రూ.245 కోట్లకు ఇల్లు అమ్మిన జుకర్ బర్గ్
Zuckerberg: 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు శాన్ ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్ మరియు ట్రామా సెంటర్‌కు సమీపంలో ఉంది. దీనిని 1928లో నిర్మించారు.

Zuckerberg: ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్ బర్గ్ డోలోరెస్ పార్క్‌లోని లిబర్టీ హిల్ పరిసరాల్లో ఉన్న ఇంటిని జుకర్‌బర్గ్ నవంబర్ 2012లో సుమారు 10 మిలియన్ డాలర్లకు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.79 కోట్లు) కొనుగోలు చేశారు.

ఇప్పుడు ఆ ఇంటిని 31 మిలియన్ డాలర్లకు (అంటే 245 కోట్లకు )విక్రయించారు. ది రియల్ డీల్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు నగరంలో జరిగిన అత్యంత ఖరీదైన గృహ విక్రయం ఇదే కావడం విశేషం.

7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు శాన్ ఫ్రాన్సిస్కో జనరల్ హాస్పిటల్ మరియు ట్రామా సెంటర్‌కు సమీపంలో ఉంది. దీనిని 1928లో నిర్మించారు.

పేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు కంపెనీ పబ్లిక్‌గా వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ ఇంటిని కొనుగోలు చేశారు. సంస్థ తన IPO ను 2012లో ప్రారంభించింది. అతను, అతని భార్య ప్రిస్సిల్లా చాన్ 2013లో ఇంటిని రీ మాడిఫికేషన్ చేయించుకున్నారు. ఇందులో వైన్ రూమ్, వెట్ బార్, లాండ్రీ రూమ్ మరియు గ్రీన్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు.

ఇంతకీ జుకర్‌బర్గ్ ఇంటిని ఎందుకు అమ్మారు?

ఇంటిని విక్రయించడానికి గల కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ ఇంటికి సంబంధించిన పార్కింగ్ స్థలంపై ఇరుగుపొరుగు వారు అసంతృప్తితో ఉన్నారని కొన్ని నివేదికలు వచ్చాయి. జుక్ పక్కన నివసించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. సెక్యూరిటీ, పార్కింగ్, ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణం చేబడుతుండడం తమ రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంటాయని వాపోతుంటారు.

జుకర్‌బర్గ్ నెట్‌వర్త్..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ ప్రస్తుతం 61.9 బిలియన్ డాలర్లుగా ఉంది. జూలై 2021లో అతను ప్రపంచ కుబేరుల్లోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. అప్పుడు అతని నికర విలువ 142 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం, అతను 17వ స్థానంలో ఉన్నారు.

2022లో మెటా షేర్ల రికార్డు స్థాయి పతనం తర్వాత జుకర్‌బర్గ్ సంపద 50 శాతానికి పైగా పడిపోయింది. జూలై 2021లో, Facebook షేర్ల ధర దాదాపు 350 డాలర్లు. మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 950 బిలియన్ డాలర్లు. ఇప్పుడు, ధర 166 డాలర్ల వద్ద ఉంది. డిసెంబర్ 2020లో జుకర్‌బర్గ్ మెటా ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 16.8 శాతం షేర్లను కలిగి ఉన్నారు. Meta ప్లాట్‌ఫారమ్‌లు Facebook యొక్క మాతృ సంస్థ.

Tags

Read MoreRead Less
Next Story