Pakistan: పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్‌

Pakistan: పంజాబ్‌ ప్రావిన్సు తొలి మహిళా సీఎంగా మరియం నవాజ్‌
చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ కుమార్తె

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఆమె ఎంపికయ్యారు. పాకిస్థాన్ చరిత్రలో ఓ ప్రావిన్సుకు మహిళ సీఎం కావడం ఇదే తొలిసారి. 50 ఏళ్ల మరియం నవాజ్ ప్రస్తుతం పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ -PMLN సీనియర్ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సీఎం ఎన్నికలో తన ప్రత్యర్థి, ఇమ్రాన్ ఖాన్ మద్దతున్న సున్ని ఇత్తెహాద్ కౌన్సిల్-SIC అభ్యర్థి రానా అఫ్తాబ్ పై గెలుపొందారు. SIC అభ్యర్థులు వాకౌట్ చేయడంతో మరియం సునాయసంగా విజయం సాధించారు.

పంజాబ్‌ అసెంబ్లీలో సీఎం ఎంపికపై ఓటింగ్‌ జరుగగా మరియం నవాజ్‌కు 220 ఓట్లు వచ్చాయి. సున్నీ ఇత్తేహాద్‌ కౌన్సిల్‌ సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్‌ చేయడంతో మరియం ప్రత్యర్థి రాణా అఫ్తాబ్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ మాలిక్‌ మహ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు.

కాగా, పంజాబ్‌ అసెంబ్లీలోని మొత్తం 371 స్థానాలకుగాను ఇటీవలే 321 మంది సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు జరిగిన స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికల్లో కూడా పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి చెందిన సభ్యులే విజయం సాధించారు. మాలిక్‌ అహ్మద్‌ఖాన్ స్పీకర్‌గా‌, మాలిక్‌ జహీర్‌ అహ్మద్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికయ్యారు. పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో మొత్తం 327 సీట్లు ఉండగా....సీఎంగా ఎన్నికవ్వాలంటే 187 మెజారిటీ మార్క్ రావాల్సి ఉంటుంది.

1992లో మరియం నవాజ్ సఫ్దార్ అవాన్ అనే మాజీ ఆర్మీ అధికారిని వివాహమాడారు. . ఆ తర్వాత నవాజ్‌ షరీఫ్‌ ప్రధాని అయినప్పుడు ఆయనకు సెక్యూరిటీ అధికారిగా అవాన్‌ పనిచేశారు. మరియం-అవాన్‌ దంపతులు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2012లో రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన మరియం PMLN పార్టీలో పలు పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. మరియం నవాజ్‌ 2012లో రాజకీయాల్లో వచ్చారు. 2013లో పీఎంఎల్‌-ఎన్‌ ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అదే ఏడాది ప్రైమ్‌ మినిస్టర్‌ యూత్‌ ప్రోగ్రామ్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు. అయితే ఆమె ఎన్నిక వివాదాస్పదం కావడంతో 2014లో పదవికి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో ఆమె పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీకి, పంజాబ్‌ ప్రావిన్షియల్ అసెంబ్లీకి పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించారు.

Tags

Read MoreRead Less
Next Story