షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ వేయించుకున్నా..

కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాస్క్ ధరించడం ఆపవచ్చా అంటే అలా ఎంత మాత్రం చేయవద్దంటున్నారు టీకాలు అందించే నిపుణులు. రెండు కారణాల వల్ల, ప్రజలు టీకాలు వేయించుకున్న తర్వాత మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించడం అనేవి కొంతకాలం సిఫార్సు చేయబడుతుంది.
కరోనా వైరస్ టీకాలను రెండు డోసుల ద్వారా అందిస్తారు. ఫైజర్ టీకా రెండవ మోతాదు మొదటి డోసు తీసుకున్న మూడు వారాల తరువాత తీసుకోవాల్సి ఉంటుంది. టీకాల ప్రభావం సాధారణంగా తక్షణమే ఉండదు. అందుకే కొంత కాలం పాటు మాస్కులు ధరించడం అవసరం.
మొదటి డోస్ తర్వాత కొన్ని వారాల్లో ప్రజలు కొంతమేర కోవిడ్ నుంచి రక్షణ పొందుతారని భావిస్తున్నారు. రెండవ డోస్ తర్వాత రెండు వారాల వరకు పూర్తి రక్షణ జరగకపోవచ్చు.
ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ప్రజలను సంక్రమణ నుండి పూర్తిగా రక్షిస్తాయా లేదా లక్షణాల నుండి రక్షించబడతాయా అనేది ఇంకా తెలియదు. అంటే టీకాలు తీసుకున్న వ్యక్తులు కూడా వ్యాధి బారిన పడవచ్చు లేదా వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువ రేటులో ఉంటుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని టీకా నిపుణుడు డెబోరా ఫుల్లర్ అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com