America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మైనే రాష్ట్రంలోని లూయిస్టన్ నగరం తుపాకీ రెండు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో కనీసం 22 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మందికిపైగా గాయపడ్డారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో మైనేలోని లెవిస్టన్ నగరంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం ఒక తీవ్రవాది ఈ కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు.
నిందితుడు కాల్పులు జరిపిన స్థానంలో రైఫిల్ పట్టుకుని ఉన్న రెండు ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి, అతను పరారీలో ఉన్నాడని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతనిని గుర్తించడానికి స్థానిక ప్రజల సహాయాన్ని కోరారు. అయితే దర్యాప్తులో భాగంగా.. ఆ ప్రాంతాల్లోని అన్ని వ్యాపారాలను మూసివేయాలని ఆండ్రోస్కోగిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫేస్ బుక్ ప్రకటనలో తెలిపింది.
మైనే డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేప్టీ ప్రతినిధి.. ప్రజలను తలుపులు మూసి తమ ఇళ్లలోనే ఉండాలని కోరారు. లెవిస్టన్ లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ భారీ ప్రాణ నష్టం జరిగిందని ఒక ప్రకటన విడుదల చేసింది. ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీలో ఒక భాగమైన లెవిస్టన్.. మైనే అతిపెద్ద నగరమైన పోర్ట్ల్యాండ్కు ఉత్తరాన 35 మైళ్ల (56 కి.మీ.) దూరంలో ఉంది. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
అంతకుముందు, 2022లో టెక్సాస్లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి జరిపిన కాల్పులు 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను బలితీసుకున్నాయి. ఆ ఘటన తరువాత ఇదే అత్యంత ఘోరమైన సామూహిక కాల్పులు అని రాయిటర్స్ పేర్కొంది.
కాల్పులు జరిగిన ప్రతిసారి అమెరికాలో గన్ కల్చర్ పై ఎప్పటిలాగే చర్చ జరుగుతుంటుంది. దాదాపు 50 ఏళ్ళ కిందట అమెరికా అధ్యక్షుడు లిండన్ బైన్స్ జాన్సన్ "అమెరికాలో నేరాల వల్ల మరణిస్తున్న వారిలో ఎక్కువ మరణాలు తుపాకుల వల్లే సంభవిస్తున్నాయి. దేశంలో పెరుగుతున్న ఆయుధ సంస్కృతే దీనికి ప్రధాన కారణం'' అన్నారు. ఆ సమయంలో, అమెరికాలో దాదాపు 9 కోట్ల తుపాకులు ఉన్నాయి. కానీ నేడు, 50 సంవత్సరాల తరువాత, అక్కడ అంతకన్నా ఎక్కువ తుపాకులు ఉన్నాయి, అలాగే మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com