Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం.. 255 మంది మృతి

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో భారీ భూకంపం.. 255 మంది మృతి
Afghanistan: దేశంలోని తూర్పు పక్టికా ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో కనీసం 255 మంది మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా తెలిపింది.

Afghanistan: దేశంలోని తూర్పు పక్టికా ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపంలో కనీసం 255 మంది మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ మీడియా తెలిపింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.

భూకంప బాధితులను ఆ ప్రాంతం నుండి హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తీవ్రమైన భూకంపం పక్టికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాలను కదిలించింది. వందలాది మంది మరణించారు. భారీ సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. భూకంప తీవ్రతకు ఇళ్ళు ధ్వంసమయ్యాయి" అని తాలిబన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. " విపత్తును నివారించడానికి వెంటనే ఆ ప్రాంతానికి బృందాలను పంపాలని మేము అన్ని సహాయ ఏజెన్సీలను కోరుతున్నాము." అని తెలిపారు.

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్, తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story