MAY DAY: శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం

MAY DAY: శ్రమిద్దాం.. శ్రమని గౌరవిద్దాం
X
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా మేడే.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

మనం ప్రతియేటా మే 1వ తేదీన మేడే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ( Labour Day 2024 ) జరుపుకుంటామన్న విషయం తెలిసిందే. మే డే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం. కార్మిక దినోత్సవం మూలాలు పరిశీలిస్తే మనకు 19వ శతాబ్దంలో కనిపిస్తాయి. అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. 1886, మే 1న దాదాపు 2 లక్షల మంది కార్మికులు 8 గంటల పనిదినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. అంతేకాకుండా చక్కటి పనివాతావరణాన్ని కల్పించడం, తక్కువ వేతనాలు, బాలకార్మికుల వంటి అంశాలపై కూడా పోరాటం చేశారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది. షికాగోలో హిసాత్మకంగా మారింది. షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన శాంతియుత సమావేశంలో బాంబు పేలడంతో ఈ ఘటన విషాదకరంగా మారింది. ఈ ఘటనలో ఇటు పోలీసులు అటు సమ్మెలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షికాగో మారణకాండలో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరిస్తూ.. ఏటా మే 1వ తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలకు మే డే వేదికగా మారింది. అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలూ, నిరసన ప్రదర్శనలూ చేపట్టడం పరిపాటైంది. 1923 నుంచి ఇండియాలో ‘మే డే’ను పాటించారు. కరోనా వల్ల గతేడాది నుంచి ఎంతోమంది శ్రమ జీవులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వారిలో ధైర్యం నింపడం మన అందరి కర్తవ్యం.

సూర్యచంద్రులు.. కార్మికులు

ప్రపంచాన్ని బతికించడానికి సూర్య చంద్రులు కార్మికుల్లా పనిచేస్తుంటే, ప్రపంచాన్ని నడిపించడానికి కోట్లాదిమంది కార్మికులు సూర్యచంద్రుల్లా రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఆ కష్టానికి ఫలితాన్ని ఆశించడం ప్రతి ఒక్కరి హక్కు. ఒకప్పుడు మాత్రం అది నేరం. ఎవరైనా ప్రశ్నిస్తే విప్లవకారుడన్న ముద్ర వేసి జైల్లో తోసేవారు. 19వ శతాబ్దం చివరి వరకూ పరిస్థితులు అలానే కొనసాగాయి. ఆరోగ్యాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ పణంగా పెట్టి రోజుకు పన్నెండు గంటలకు పైగా కార్మికులు పని చేసేవారు. దశాబ్దాల తరబడి అదే విధానానికి అలవాటు పడ్డ శ్రామికులు కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీల అండతో మొదట రష్యాలో ‘ఎనిమిది గంటలు పని’ నినాదాన్ని అందుకున్నారు. అది ఇతర దేశాలకూ పాకింది. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలోని కొందరు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. తమ శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయని శ్రామికులు గొంతెత్తారు.

మన దేశంలో ఇలా...

భా­ర­త్‌­లో మొ­ద­టి­సా­రి­గా 1923 మే 1వ తే­దీన కా­ర్మిక ది­నో­త్స­వా­న్ని జరు­పు­కో­వ­డం జరి­గిం­ది. మన­దే­శం­లో ఇతర దే­శాల కంటే ముం­దే కల­క­త్తా­లో కా­ర్మి­కుల పని­గం­టల కోసం హౌరా రై­ల్వే స్టే­ష­న్లో 1862లోనే సమ్మె చే­శా­రు. 1923లో తొ­లి­సా­రి­గా భా­ర­త్ దే­శం­లో మే డే ను పా­టిం­చా­రు. ఆ తర్వాత 1920లో ట్రే­డ్ యూ­ని­య­న్ ఏర్ప­డ­డం­తో అప్ప­టి నుం­చి కా­ర్మి­క­వ­ర్గా­ల్లో చై­త­న్యం మొ­ద­లైం­ది. దీం­తో మే డే పా­టి­స్తు­న్నా­రు. కానీ అసం­ఘ­టిత కా­ర్మిక వర్గం అన్ని రం­గా­ల్లో వచ్చిం­ది. 1985 తర్వాత చో­టు­చే­సు­కు­న్న ప్రై­వే­టై­జే­ష­న్‌, లి­బ­ర­లై­జే­ష­న్‌, గ్లో­బ­లై­జే­ష­న్‌ (ఎల్పీ­జీ) పరి­ణా­మాల వల్ల అసం­ఘ­టిత కా­ర్మి­క­వ­ర్గాల కా­ర్మిక చట్టా­లు అమ­లు­కు నో­చు­కో­వ­డం­లే­దు. రెం­డో ప్ర­పంచ యు­ద్ధం తర­వాత ఐరో­పా దే­శా­ల్లో మే 1వ తే­దీ­ని సె­ల­వు ది­నం­గా పా­టిం­చ­డం మొ­ద­లు­పె­ట్టా­రు. అనం­త­రం అనేక దే­శా­లు ఇదే బా­ట­లో నడి­చా­యి. చాలా దే­శా­ల్లో కా­ర్మి­కు­ల­కు సం­బం­ధిం­చిన అనేక సం­క్షేమ పథ­కా­లు ఆ రో­జు­నే అమ­ల్లో­కి వచ్చా­యి. ఈ రో­జు­ను హిం­దీ­లో "కా­మ్‌­గ­ర్ దిన్" అని, కన్న­డ­లో "కా­ర్మి­కర ది­న­చ­ర­నే" అని, మరా­ఠీ­లో "కమ్‌­గ­ర్ ది­వ­స్" అని మరి­యు బెం­గా­లీ­లో "ష్రో­మి­క్ ది­బో­ష్" అని పి­లు­స్తా­రు. ప్ర­స్తు­తం ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా 80కి పైగా దే­శా­ల్లో కా­ర్మిక ది­నో­త్స­వా­న్ని జరు­పు­కుం­టా­రు.

Tags

Next Story