McDonald’s wedding package : మెక్ డి విందు

పెళ్లంటే పందిళ్ళు, సందళ్ళు..తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలూ..
ఆ ఆ సరే సరే.. మరి భోజనాలు, టిఫిన్ల సంగతేంటి..
వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు..
ఏంటి మీరు ఇంత ఓల్డ్…కాస్త లేటెస్ట్ బ్రేక్ ఫాస్ట్ లు ఏం లేవా..
ఇలా ఆలోచించిన ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ ఓ కొత్త ప్యాకేజీ రెడీ చేసింది. అదే ' మెక్ డి' వెడ్డింగ్ ప్యాకేజ్. వధూవరులకు వారి అతిథులకు కలిపి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ప్లాన్ చేసింది. ఇందులో 100 చికెన్ బర్గర్స్, 100 చికెన్ నగ్గెట్స్, 100 చీజ్ బర్గర్లు ఇంకా 100 చికెన్ ఫింగర్స్ ఉండనున్నాయి.
ఈ ప్యాకేజ్ కోసం మనం మినిమం 200 పీసెస్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇండోనేషియా లోని జకర్త లో లాంచ్ అయిన ఈ ప్యాకేజ్ త్వరలో ప్రపంచం లోని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ ప్యాకేజీ పెళ్లి చేసుకోవడానికి కాదు అక్కడి నుంచి కేటరింగ్ రూపంలో ఫుడ్ ని ఆర్డర్ చేసుకోవడానికి మాత్రమే.
ఇప్పటికే చాలా దేశాలలో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్లో పెళ్లి చేసుకునే అవకాశం కల్పించింది కొంత నిర్ణీత రుసుము పే చేస్తే ఆహ్వానాల నుంచి బెలూన్ ల వరకు, స్టేజి నుంచి సౌండ్ సిస్టం వరకు అన్నిటిని ఏర్పాటు చేస్తారు.నిజానికి చాలామంది సంప్రదాయవాదులు ఇలాంటి ఆహారాన్ని ఇష్టంగా తినరు కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది.. సో మీరు ట్రెండ్ ని ఫాలో అయ్యేవాళ్ళు కాకుండా ట్రెండ్ సెటర్ గా నిలవాలంటే మీరు కూడా ఈ ప్యాకేజీ ని ట్రై చేయచ్చు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com