ట్రంప్‌ మెలానియా విడాకులపై కీలక విషయాలు వెల్లడి

ట్రంప్‌ మెలానియా విడాకులపై కీలక విషయాలు వెల్లడి

రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలనుకున్న ట్రంప్‌ ఆశలు అడియాసలయ్యాయి. జో బైడెన్‌ గెలుపుతో వైట్‌హూజ్‌ నుంచి మూట ముళ్లె సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగానే ట్రంప్‌కు మరో దెబ్బ తగలబోతోంది. వైట్‌హౌజ్‌ను వీడిన మరు క్షణమే ట్రంప్‌కు విడాకులు ఇవ్వాలని మెలానియా ట్రంప్‌ డిసైడ్‌ అయినట్లు ప్రచారం సాగుతోంది. వైట్ హౌజ్ కమ్యూనికేషన్స్ మాజీ డైరెక్టర్ ఒమారసా చెప్పినట్లు డైలీ మెయిల్‌ ప్రచురించిన కథనం ఆసక్తి రేపుతోంది.

వైట్‌హౌజ్‌ను వీడిన వెంటనే మెలానియా.. ట్రంప్‌కు విడాకులు ఇచ్చేస్తారని ఒమారసా తెలిపినట్లు డైలీ మెయిల్‌ పేర్కొంది. వైట్‌హౌజ్‌లో కీలకంగా వ్యవహరించిన ఆమె.. ట్రంప్‌కు చెప్పాపెట్టకుండా ఉద్యోగం మానేశారు. అధికారిక నివాసంలో పరిణామాలను దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగానే తాను ఈ విషయాల చెబుతున్నానని ఒమారసా స్పష్టం చేసినట్లు డైలీ మెయిల్‌ తెలిపింది. ట్రంప్ దంపతుల 15 ఏళ్ల వైవాహిక జీవితం ఇదివరకే ముగిసిందని.. కాకుంటే పదవిలో ఉండగా విడాకులివ్వడం మరింత చర్చకు దారితీసే అవకాశముందన్న కారణంతోనే.. ట్రంప్‌ను మెలానియా ఇన్నాళ్లు భరిస్తూ వచ్చారని తెలిపింది.

2016లో ట్రంప్‌ గెలవడం మెలానియాకు నచ్చలేదా? ఆయన ఓడితే అప్పుడే విడాకులిచ్చేదా? అంటే అవుననే అంటున్నారు మెలానియా సన్నిహితులు. మెలానియాది కాంట్రాక్ట్ మ్యారేజ్‌ అని.. ట్రంప్‌ అధ్యక్షుడిగా గెలిచిన సమయంలో మెలానియా కన్నీటి పర్యంతం అయ్యారని చెప్పింది. అంతే కాదు వైట్ హౌజ్ కు వెళ్లడం ఇష్టం లేకే కొడుకు చదువు కోసం ఫ్లోరిడాలోనే ఉంటున్నారని.. మెలానియా సన్నిహితులురాలు చెప్పిన విషయాలను డైలీ మెయిల్ ప్రస్తావించింది.

ఇక ట్రంప్ నుంచి మెలానియా విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సమయంలోనే.. మెలానియా మాజీ సలహాదారు స్టెఫనీ వాకోఫ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. విడాకుల ఒప్పందానికి సంబంధించి ట్రంప్, మెలానియాల మధ్య అనేక చర్చలు జరిగాయని... నిజానికి వైట్ హౌజ్‌లో వాళ్లిద్దరికీ సెపరేట్ బెడ్ రూమ్స్ ఉన్నాయంటూ కీలక నిజాలు బయటపెట్టారు. వాళ్లది కాంట్రాక్ట్‌ మ్యారేజే అని స్పష్టం చేశారు. విడాకుల ఒప్పందంలో భాగంగా... తన కొడుకు బారోన్ ట్రంప్‌కు ఆస్తిలో వాటా కేటాయింపులపైనా ట్రంప్‌తో చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్‌ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ... అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదు. ఇప్పుడు ట్రంప్‌ ఓడిపోవడంతో ఆయనకు మెలానియా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story