Meta : ఉద్యోగిపై జూకర్ బర్గ్ ఆగ్రహం.. తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశం

ఫేస్ బుక్ ఉద్యోగిని రాజీనామా చేయాలని కఠినంగా మాట్లాడారు మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్. మంగళవారం కంపెనీకి చెందిన ఓ మెయిల్ ను ఫేస్ బుక్ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జూకర్ బర్గ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మెయిల్ లో ఓ ఉద్యోగిని జూకర్ బర్గ్ ఉద్యోగానికి రాజీనామా చేయమని కోరతాడు. అయితే ఈ మెయిల్ 2010లో పంపబడింది. అందులో కాన్ఫిడెన్షియల్ - డోంట్ షేర్ అనే లైన్ తో మెయిల్ ప్రారంభమవుతుంది.
అంతర్గత మెయిల్ ను పబ్లిక్ డొమేన్ లో పెట్టడం ద్రోహమని అన్నాడు జూకర్ బర్గ్. ఈ విషయాన్ని ఎవరు లీక్ చేసినా వెంటనే రాజీనామా చేసి సంస్థనుంచి బయటకు వెళ్లాలని ఆయన కోరాడు. అంతర్గత సమాచారాన్ని బయట పెట్టడం కరెక్ట్ అనిపిస్తే సదరు ఉద్యోగి ఈ సంస్థకు పనికిరాడు. మీరు ఈ సంస్థను వీడండి. లేకపోతే మీరు ఎవరనేది కనుక్కోవడం మాకు పెద్ద సమస్యకాదని అన్నాడు జూకర్ బర్గ్. తాజాగా మోటా సంస్థలో రానున్న కొద్ది నెలల్లో 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నారు. 2022వ సంవత్సరం ఆర్థికంగా మెటా సంస్థకు నష్టాన్ని చేకూర్చిందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

