అంతర్జాతీయం

ప్రేయసిని కలుసుకునేందుకు ఏకంగా సొరంగం.. చివరికి..

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. అయితే ఈ వివాహేతర సంబంధం కోసం మనుషులు ఎంత దూరం వెళ్తున్నారో వారికే తెలియడం లేదు..

ప్రేయసిని కలుసుకునేందుకు ఏకంగా సొరంగం.. చివరికి..
X

వివాహేతర సంబంధాలు పచ్చని కాపురంలో చిచ్చు పెడుతున్నాయి. అయితే ఈ వివాహేతర సంబంధం కోసం మనుషులు ఎంత దూరం వెళ్తున్నారో వారికే తెలియడం లేదు.. తాజాగా ఓ వ్యక్తి తన ప్రేయసిని కలుసుకునేందుకు ఏకంగా తన బెడ్ రూమ్ నుంచి ప్రియురాలి బెడ్ రూమ్ వరకు సొరంగం తవ్వేశాడు. ఈ ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.

తైజువానాకు చెందిన కన్‌స్ట్రక్షన్ వర్కర్ అల్బెర్టో పక్కింట్లో ఉండే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే తన ప్రేయసిని కలుసుకునేందుకు రహస్య మార్గాన్ని ఎంచుకున్నాడు.. వివాహిత భర్త వాచ్ మెన్ కావడంతో నైట్ డ్యూటికి వెళ్ళేవాడు. అతను వెళ్ళగానే వీరిద్దరూ కలుసుకునేవారు. అయితే అన్నీ రోజులు ఒకేలా ఉండవు కదా..

ఒకరోజు డ్యూటీ నుంచి ముందుగానే ఇంటికి వచ్చిన ఆమె భర్తకు భార్య ప్రవర్తనలో మార్పు కనిపించింది. రూమ్ లో కూడా ఎదో అలజడి వినిపించింది. ఏంటి అని బెడ్డు కింద తొంగి చూస్తే అక్కడ అల్బర్టో నక్కి ఉండడం కనిపించాడు. అయితే అతను కొద్ది క్షణంలోనే అక్కడినుంచి మాయం అయిపోయాడు.

దీనితో అయోమయంలో పడ్డ మహిళ భర్తకి బెడ్డు కింద ఓ రంధ్రం కనిపించింది. దానిని తెరిచి చూస్తే సొరంగ మార్గం కనిపించింది. దీనితో విషయం తన భార్య అక్రమసంబంధం గురించి తెలిసిపోవడంటతో మహిళ భర్త ఆమెను చితకబాదాడు. ఆ తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Next Story

RELATED STORIES