అఫ్గానిస్థాన్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు.. దేశం వీడేందుకు ఎయిర్‌పోర్ట్‌కి జనం పరుగులు

అఫ్గానిస్థాన్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు.. దేశం వీడేందుకు ఎయిర్‌పోర్ట్‌కి జనం పరుగులు
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబన్లు పూర్తిస్థాయిలో పట్టుసాధించారు. ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ హస్తగతం చేసుకున్నారు.. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి

Afghanistan: అఫ్గానిస్థాన్‌పై తాలిబన్లు పూర్తిస్థాయిలో పట్టుసాధించారు. ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ హస్తగతం చేసుకున్నారు.. దీంతో అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు దేశాన్ని విడిచివెళ్లిపోయేందుకు కాబూల్‌ విమానాశ్రయానికి భారీగా తరలివస్తున్నారు. వీసాలు, ఎలాంటి తనీఖీలు లాంటివేమీ పట్టించుకోకుండా ప్రజలంతా తోసుకుంటూ.. ఎయిర్‌పోర్ట్‌లోకి చొచ్చుకుని వస్తున్నారు. విమానం రన్‌ వే పైకి వచ్చేది ఆలస్యం ఎగబడుతున్నారు. జనం ఉరుకులు, పరుగులు, తోపులాటలతో ఎటుచూసినా గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి.

ఏదో రకంగా ఫ్లైట్‌లో ఆన్‌బోర్డ్‌ అయ్యేందుకు నిచ్చెన పైనుంచి ఎగబాకుతున్న దృశ్యాలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. విమానం ఏ దేశానికి వెళ్తోందనేది పట్టించుకోకుండా.. కేవలం ఆఫ్గన్ నుంచి ప్రాణాలతో బయటపడితే చాలని భావిస్తూ ఎలాగోలా ఫ్లైట్‌ ఎక్కేందుకు నానాతంటాలు పడుతున్నారు. చూస్తుంటే ఇది ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టు లేదు.. బస్టాండ్‌లో కిక్కిరిసి వెళ్లే బస్సుల్ని మించినపోయేలా జనం ఎగబడుతున్న దృశ్యాలు ఇప్పుడు హృదయాల్ని కలచివేస్తున్నాయి.

కాబూల్‌లోకి ప్రవేశించిన తాలిబన్లు ఇళ్లను సైతం జల్లెడ పడుతున్నారు. కార్లు లాక్కుంటున్నారు. కొన్ని చోట్ల అరాచక శక్తులు కూడా పేట్రేగి లూటీలకు పాల్పడుతున్నాయి. పరిస్థితులు క్షణక్షణానికీ భయంకరంగా మారుతుండడంతో దేశం విడిచి వెళ్లేందుకు వేలాది మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎయిర్‌పోర్ట్‌కి తరలివస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు US బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాల్సి వచ్చిందంటే అక్కడ ఎంత అరాచకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అటు, ఎయిర్‌పోర్ట్‌కి వాహనాలతో రద్దీ ఒక్కసారిగా పెరగడంతో.. అటువైపు వెళ్లే దారుల్లో పూర్తిగా ట్రాఫిక్‌ జామ్‌తో అయ్యింది. అఫ్ఘాన్‌ అధ్యక్షడు అష్రఫ్‌ ఘనీతో పాటు పలువురు మంత్రులు ఇప్పటికే దేశాన్ని విడిచివెళ్లారు. అఫ్ఘనిస్తాన్‌ తాత్కలిక ప్రెసిడెంట్‌గా తాలిబన్ల చీఫ్‌ అబ్దుల్‌ ఘనీ సారధ్యంలో మొత్తం అధికార మార్పిడి ప్రక్రియను జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story