Miss Universe: తడబడిన హర్నాజ్

Miss Universe: తడబడిన హర్నాజ్
X
హర్నాజ్‌ సందు చివరి ర్యాంప్ వాక్‌; ప్రెగ్నెంట్‌ అంటూ విమర్శలు

హర్నాజ్‌ సందు మిస్‌ యూనివర్స్‌గా తన గడువు ముగియడంతో తన కిరిటాన్ని ఇంకొకరికి అందించేందుకు సిద్ధమైంది. ఆదివారం మిస్‌ యూనివర్స్‌గా చివరి ర్యాంప్‌వాక్‌ను చేసింది. అందమైన బ్లాక్‌ గౌనులో స్టేజ్ పై మెరిసి అందరిని అలరించింది.


మిస్‌ యునివర్స్‌ టైటిల్‌కు తాను అర్హురాలు ఎలా అయిందీ అనే సందేశం బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండగా హర్నాజ్ భావోద్వేగానికి గురైంది. ఇక మిస్‌ యూనివర్స్‌ టైటిల్ గెలుచుకున్నాక... కాస్త బరువు పెరిగిన హర్నాజ్.. దీనిపై తనను చాలమంది దూషిస్తున్నారని పేర్కొంది. సోషల్‌ మీడియాలో కొందరైతే హర్నాజ్‌ ప్రెగ్నెంట్‌ అని పిచ్చి రాతలు రాస్తున్నారు.


మరోవైపు సందు త్వరలోనే సినిమాల్లోకి రానున్నారని తెలుస్తోంది. హర్నాజ్‌ స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు తనను బరువు పెరిగినందుకు చాలా మంది దూషిస్తున్నారు అలా విమర్శించడం చాలా బాధగా ఉందని తెలిపారు. శారీరకంగా నేను కొంచెం బరువు పెరిగాను అయిన నాకు ఇబ్బంది కావడంలేదు ఇప్పుడు నేను చాలా సౌకర్యంగా ఉన్నానని తెలిపింది. విమర్శలు పెద్ద విషయమేమి కాదని తెలిపింది.

Tags

Next Story