Modi Italy Tour: ఇటలీలో మోదీకి ఘన స్వాగతం.. మూడు రోజులు అక్కడే..

Modi Italy Tour (tv5news.in)

Modi Italy Tour (tv5news.in)

Modi Italy Tour: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Modi Italy Tour: జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... రోమ్ లో దిగిన వెంటనే వెన్యూ పియాజా గాంధీ ప్రాంతానికి వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. ఇటలీలోని భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకుని, మోదీని స్వాగతం పలికారు.

ఈ ప్రాంతమంతా మోదీ మోదీ నినాదాలతో మారుమ్రోగింది. గాంధీజీ ఆదర్శలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ధైర్యం, ప్రేరణ ఇస్తాయని అన్నారు. రోమ్‌లో మహాత్ముడికి నివాళులర్పించే అవకాశం తనకు లభించిందని ప్రధాని ట్వీట్‌ చేశారు.

మూడు రోజుల ఇటలీ పర్యటన కోసం రోమ్‌కు వచ్చిన ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని మోదీనే. ఇటలీ పర్యటనలో మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రోమ్, వాటికన్ సిటీ నగరాల్లో పర్యటిస్తారు. ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారు.

శనివారం నుంచి రెండు రోజుల పాటు వాటికన్‌ సిటీలో జరగే జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఈ సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌, ఇండోనేషియా, సింగపూర్‌, జర్మనీ దేశాధినేతలతో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా పోప్‌ ఫ్రాన్సిస్‌తోనూ మోదీ సమావేశం కానున్నారు.

అక్టోబర్‌ 31వరకు ఇటలీలో ఉండనున్న మోదీ.. అక్కడినుంచి నేరుగా బ్రిటన్‌ బయల్దేరుతారు. యూకే ప్రధాని బోరిన్‌ జాన్సన్‌ ఆహ్వానం మేరకు నవంబరు 1న గ్లాస్గోలో జరిగే కాప్‌ 26 సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బోరిస్‌తోనూ ప్రధాని భేటీ అవుతారు. నవంబరు 3న భారత్‌ కు తిరిగివస్తారు.

Tags

Read MoreRead Less
Next Story