China : మరోసారి కుండపోత

చైనాలోని వివిధ నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.ఆగ్నేయ చైనా జియాంగ్జి ప్రావిన్స్ లోని నాన్ చాంగ్ లో వరద నీటిలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు సెంట్రల్ చైనా హుబే ప్రావిన్స్ లో చిక్కుకున్న 25 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ CCTV తెలిపింది. గత వారం రోజుల్లో హునాన్ ప్రావిన్స్ లో కుండపోత వర్షం కారణంగా 3వేల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు.
భారీ వర్షాలతో డ్రాగన్ దేశం చైనా మరోసారి ఇబ్బందులపాలు అవుతోంది. సరిగ్గా నెల రోజుల క్రితం చైనా రాజధానిలో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మరోసారి వర్షాలు మొదలయ్యాయి. చంగ్‌షా -- సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో శనివారం నుండి ఆదివారం వరకు భారీ వర్షం కురవడంతో 3,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రాంతీయ వరద మరియు కరువు నియంత్రణ ప్రధాన కార్యాలయం తెలిపింది. భారీ వర్షాల కారణంగా సంగ్జి కౌంటీ సీటులోని లోతట్టు ప్రాంతాలలో వరదలు సంభవించాయి, కొన్ని గ్రామాలు మునిగిపోయాయి. వరదల కారణంగా లిషుయ్ నది వెంబడి ఉన్న రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి. 2012 వరద బీజింగ్‌లో ఒక్కరోజులోనే 79 మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు కాస్త అధికార యంత్రాంగం డ్రైనేజీ వ్యవస్థ దగ్గర నుంచి మెరుగుపరిచి ఉండి ఉంటే ఇలాంటి సమస్య వచ్చేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 140 ఏళ్లలో బీజింగ్‌లో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, వాతావరణ మార్పుల కారణంగా విపరీతమైన వాతావరణ సంఘటనలు పెరిగే అవకాశం ఉన్నందున, చైనా తన వాతావరణ మరియు హైడ్రోలాజికల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరించారు .
మరోవైపు కోవిడ్ కొట్టిన దెబ్బనుంచి నిదానంగా కోలుకుంటూ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వస్తున్న ఈ విపత్తు వరదలు చైనాను మరో దెబ్బ కొట్టడంలో ఆశ్చర్యం లేదు , అయితే ఇక్కడి యువతకు నిరుద్యోగంమే కాదు అనిశ్చిత వాతావరణం కూడా వారి భావి జీవితానికి ముప్పు కలిగిస్తాయని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com