24 Feb 2021 10:10 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Most Expensive...

Most Expensive Biryani: వామ్మో! అక్కడ ప్లేట్ బిర్యానీ రూ.20 వేలంట!

Most Expensive Biryani: రేటు వింటే గొంతు పట్టేస్తుంది.. ప్లేటు బిర్యానీ రూ.20 వేలంట. స్కిన్ లెస్ చికెనో, బోన్ లెస్ మటనో పెట్టినా అంత రేటు ఉండదు.. మరెందుకు అంత రేటంటే తినే పదార్థాలకి ఎక్కువగా స్వీట్స్ వంటి వాటికి సిల్వర్ ఫాయిల్ చుట్టినట్లు ఆ రెస్టారెంట్లో చికెన్ ముక్కలకి గోల్డ్ ఫాయిల్ చుడతారట.

Most Expensive Biryani: వామ్మో! అక్కడ ప్లేట్ బిర్యానీ రూ.20 వేలంట!
X

Most Expensive Biryani

Most Expensive Biryani: రేటు వింటే గొంతు పట్టేస్తుంది.. ప్లేటు బిర్యానీ రూ.20 వేలంట. స్కిన్ లెస్ చికెనో, బోన్ లెస్ మటనో పెట్టినా అంత రేటు ఉండదు.. మరెందుకు అంత రేటంటే తినే పదార్థాలకి ఎక్కువగా స్వీట్స్ వంటి వాటికి సిల్వర్ ఫాయిల్ చుట్టినట్లు ఆ రెస్టారెంట్లో చికెన్ ముక్కలకి గోల్డ్ ఫాయిల్ చుడతారట. అందుకే అంత రేటు. మరి ఇంతకీ ఈ గోల్డ్ బిర్యానీ ఎక్కడ దొరుకుంతుందటే ఎడారి దేశమైన దుబాయ్‌లో. పచ్చని పసిడి కాంతులు వెదజల్లే వేడి వేడి బిర్యానీని అందించేది బాంబే బరో అనే ఓ భారతీయ రెస్టారెంట్ అధినేతలు. రాయల్ గోల్డ్ బిర్యానీ పేరుతో ఈ బిర్యానీని వారు విక్రయిస్తున్నారు.

ప్లేట్ ధర వచ్చి 1000 దిర్హమ్‌లు.. అంటే మన కరెన్సీలో రూ.19,700లు. స్వచ్ఛమైన 23 కేరెట్లున్న తినే బంగారంతో బిర్యానీని గార్నిష్ చేసి వడ్డిస్తారు. అందరికీ కాదండోయ్ ఆర్డర్ ఇచ్చిన వారికి మాత్రమే స్పెషల్‌గా తయారు చేసి తీసుకువస్తారు. గోల్డ్ అలా తినేస్తే కడుపు నొప్పి, గట్రా ఏమీ రావు కదా అని అనుమానం అస్సలు అక్కరలేదు. బంగారం లాంటి కస్టమర్లు మళ్లీ మళ్లీ రావాలని మాకు మాత్రం ఉండదా ఏంటి. మీ ఆరోగ్యానికి ఏం ఢోకా ఉండదు.. పైగా ఈ బంగారం బిర్యానీ తింటే మీ మేని మెరుపు పసిడి కాంతులు వెదజల్లుతుంది.

వంద శాతం గ్యారెంటీ మాది అంటోంది రెస్టారెంట్ యాజమాన్యం. ఇక ఈ రాయల్ గోల్డ్ బిర్యానీలో విభిన్న రకాల అన్నాన్ని వడ్డిస్తారు. బిర్యానీ రైస్, కీమా రైస్, కుంకుమపువ్వుతో చేసిన అన్నం, తెల్లన్నంతో బిర్యానీ రెడీ చేస్తారు. దానిపై ఉడకబెట్టిన గుడ్లు, చిన్న బంగాళదుంపలు, జీడిపప్పు, దానిమ్మ గింజలు అన్నీ ఉన్న ఆ ప్లేటు నోరూరిస్తుంది.

ఇంకా కశ్మీరీ గొర్రె కబాబ్, ఓల్డ్ దిల్లీ కబాబ్స్, రాజ్‌పుత్ చికెన్ కబాబ్స్, మొఘలాయి కోఫ్తా వంటి మాంసం ముక్కలను పెట్టి వాటిపై 23 కేరెట్ల తినే బంగారాన్ని అలంకరిస్తారు. సైడ్ డిష్‌లు బిర్యానీలో కలుపుకునేందుకు వీలుగా నిహారీ సలాన్, జోధ్‌పురి సలాన్, బాదామీ సాస్, రైతాను ఇస్తారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో ఉన్న ఈ రెస్టారెంట్‌కు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు విచ్చేస్తుంటారు. ఇంత ఖరీదైన బిర్యానీ తయారు చేసే రెస్టారెంట్ ప్రపంచంలో ఇక్కడ మాత్రమే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు.

Next Story