ఇది గొర్రెకాదు 'డబుల్ డైమండ్'.. అందుకే రేటు కోట్లలో..

ఇది గొర్రెకాదు డబుల్ డైమండ్.. అందుకే రేటు కోట్లలో..
జీడిపప్పులు, బాదాం పప్పులు తిని బాగా బలిష్టంగా తయారైన గొర్రెలకు మార్కెట్లో డిమాండ్ బాగానే ఉంటుంది.

జీడిపప్పులు, బాదాం పప్పులు తిని బాగా బలిష్టంగా తయారైన గొర్రెలకు మార్కెట్లో డిమాండ్ బాగానే ఉంటుంది. మరి ఈ గొర్రె ఏం తిందో.. దాని యాజమాని ఆ గొర్రెకు స్పెషల్ గా ఏం ఫుడ్డు పెట్టారో కాని ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయింది. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా.. అక్షరాలా 3కోట్ల 75 లక్షలు. మరి ఎక్కడ ఉందీ ఈ డబుల్ డైమండ్ గొర్రె అంటే.. నెదర్లాండ్స్ లోని టెక్సెల్ లో గొర్రెల పరిశ్రమ ఉంది. ఇక్కడి గొర్రెలకు ఉత్తమ జాతి గొర్రెలుగా పేరు వచ్చింది. జన్యుపరంగా ఉత్తమమైన గొర్రెగా పేరుతెచ్చుకున్న ఈ గొర్రెను వేలంలో పెట్టారు. అంత రేటైనా దీనిని సొంతం చేసుకోవాలని యూకే రైతులు పోటీపడ్డారు. ఓ ముగ్గురు రైతులు కలిసి ఈ గొర్రెను రూ.3కోట్ల 75లక్షల 78వేల 379లకు సొంతం చేసుకున్నారు. గతంలో కూడా ఓ గొర్రెను ఇక్కడి మార్కెట్లో 2కోట్ల 24లక్షలకు అమ్మారట. ఇప్పుడు ఈ నెలల వయసున్న డబుల్ డైమండ్ మరి కొంత పెరిగిన తరువాత దాని వీర్యం సేకరించి కృత్రిమ గర్భధారణతో ఈ జాతి గొర్రెలను మరిన్ని సృష్టించాలని రైతులు భావిస్తున్నారట. కోట్లు కురిపిస్తున్న గొర్రె కదా.. ఆ మాత్రం ఆశ ఉండకపోతే ఎలా.

Tags

Read MoreRead Less
Next Story