Indonesia: మహిళను మింగేసిన కొండచిలువ

అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన 36 ఏండ్ల మహిళ విగతజీవిగా ఒక కొండ చిలువ కడుపులో కన్పించిన ఘటన సెంట్రల్ ఇండోనేషియాలో చోటు చేసుకుంది ఇండోనేసియాలో దారుణం జరిగింది. ఓ కొండచిలువ మహిళను చంపేసింది. ఈ దారుణ ఘటన జూలై 2న చోటుచేసుకుంది. భర్త రక్షించే ప్రయత్నం చేసినప్పటికే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
ఇండోనేసియాలోని సౌత్ సులవేసిలో ఉన్న లువు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే సిరియతి అనే మహిళకు ఐదుగురు సంతానం. అయితే పిల్లల్లో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని మందుల కోసం ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లింది. అడవి గుండా వెళ్తోంది. చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ మందుల షాపుకు వెళుతోంది. అక్కడే చెట్లపై ఉన్న భారీ కొండచిలువ మహిళపై దాడి చేసి చుట్టచుట్టి నలిపేసింది. తర్వాత మహిళను ఆమె కాళ్లదాకా మింగేసింది. ఎంత సేపైనా భార్య రాలేదని ఆమెను వెతుక్కుంటూ వెళ్తుంటే అదే దారిలో భర్తకు భయానక దృశ్యం కనిపించింది. తన భార్యను కొండచిలువ కాళ్లదాకా మింగేయడం కనిపించింది. కోపంతో వెంటనే కొండచిలువను చంపి మహిళను బయటికి తీశాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు వదిలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com