Nepal: ఎల్‌పీజీ సిలిండర్ పేలి ఎంపీ తల్లి మరణం.. మంత్రికి తీవ్రగాయాలు..

Nepal: ఎల్‌పీజీ సిలిండర్ పేలి ఎంపీ తల్లి మరణం.. మంత్రికి తీవ్రగాయాలు..
Nepal: నేపాల్ ఎంపీ తల్లి ఎల్‌పీజీ సిలిండర్ పేలుడులో కాలిన గాయాలకు గురై మరణించారు. మంత్రిని మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకి తరలించనున్నారు.

Nepal: నేపాల్ ఎంపీ తల్లి ఎల్‌పీజీ సిలిండర్ పేలుడులో కాలిన గాయాలకు గురై మరణించారు. మంత్రిని మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకి తరలించనున్నారు. వంట గదిలోని గ్యాస్ సిలిండర్‌ పేలడంతో నేపాల్‌ ఎంపీ చంద్ర భండారీకి, ఆయన తల్లికి తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంత్రి తల్లి మరణించారు. భండారీ తదుపరి చికిత్స కోసం విమానంలో ముంబైకి తరలించనున్నారు.

నేపాల్ ఎంపీ చంద్ర భండారీ, అతని తల్లి ఖాట్మండులోని వారి నివాసంలో ఉన్నారు. మంత్రి తల్లి హరి కళా భండారి గురువారం ఉదయం మృతి చెందగా, తదుపరి చికిత్స కోసం భండారీని విమానంలో ముంబైకి తరలించనున్నట్లు ఎంపీ కార్యాలయం తెలిపింది. LPG గ్యాస్ లీకేజీ పేలుడులో భండారీకి 25% గాయాలు కాగా, అతని తల్లికి 80% కాలిన గాయాలయ్యాయి.

"పరిస్థితి బాగా లేదు, కాలిన గాయాలతో ఉన్న భండారీని ఉన్న ప్రత్యేక ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఇక్కడ చికిత్స సాధ్యం కాదు," అని మొదట తీసుకెళ్లిన కీర్తిపూర్ బర్న్స్ హాస్పిటల్ అధికారులు చెప్పారు. ఆసుపత్రి సిఫార్సు మేరకు ఎంపీని విమానంలో ముంబైకి తరలించేందుకు సిద్ధమయ్యారు. నవీ ముంబైలోని నేషనల్ బర్న్స్ హాస్పిటల్‌లో అతని చికిత్స కొనసాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story