Abdul Rehman Makki: ముంబై పేలుళ్ల కుట్రదారుడు అబ్దుల్ రెహ్మాన్ మక్కీ మృతి

ముంబై పేలుళ్ల కుట్రదారుడు, లష్కరే తాయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రరం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మరణించాడు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడంతో కొన్ని రోజుల క్రితం లాహోర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరిన మక్కీ.. గుండెపోటు రావడంతో చనిపోయినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ముంబై పేలుళ్ల కుట్రదారుడు, లష్కరే తాయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రరం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మరణించాడు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడంతో కొన్ని రోజుల క్రితం లాహోర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరిన మక్కీ.. గుండెపోటు రావడంతో చనిపోయినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019 మేలో మక్కీనీ అరెస్టు చేసిన పాకిస్థాన్ ప్రభుత్వం అతడిని లాహోర్‌లో గృహ నిర్బంధంలో ఉంచింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడని నమోదైన కేసులపై విచారణ జరిపిన పాక్ కోర్టు 2020లో అతడిని దోషిగా తేల్చింది. 2023 జనవరిలో మక్కీకి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడులలో మక్కీకి ప్రమేయం ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్టు మక్కీపై ఆరోపణలు ఉన్నాయి. రెడ్ ఫోర్ట్‌పై 2000 డిసెంబర్ 22న జరిగిన దాడిలో కూడా మక్కీకి సంబంధం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com