Imran khan: దేశం కోసం వెయ్యేళ్లు జైల్లోనే ఉంటా

Imran khan: దేశం కోసం వెయ్యేళ్లు జైల్లోనే ఉంటా
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వెల్లడి... ఇమ్రాన్‌పై మరో కేసు... తన భర్తకు జైల్లోనే విషమిచ్చి హత్య చేస్తారని ఇమ్రాన్‌ భార్య ఆందోళన....

తోషాఖానా కేసులో మూడేళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌( Imran Khan) దేశం కోసం అవసరమైతే వెయ్యేళ్లు కూడా జైలులో గడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆగస్టు 22న ఈ కేసు ఇస్లామాబాద్‌ హైకోర్టు డివిజను బెంచి ఎదుట విచారణకు రానుంది. శుక్రవారం జైలులో ఇమ్రాన్‌ (Pakistan Tehreek-e-Insaf chairman Imran Khan) ను కలిసిన అనంతరం ఆయన న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ పై విషయం వెల్లడించారు.


మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలోని పాక్‌ రాయబార కార్యాలయ రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారన్న అభియోగంతో ఇమ్రాన్‌ ఖాన్‌పై అధికారిక రహస్యాల చట్టం కింద ఇంకో కేసు నమోదైంది. ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (FIA) దాఖలు చేసిన FIR ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఈ అభియోగం రుజువైతే ఇమ్రాన్‌కు 2 నుంచి 14 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. కొన్ని కేసుల్లో మరణశిక్ష కూడా విధించవచ్చు. అమెరికాలోని పాక్‌ ఎంబసీ నుంచి లీకైన సమాచారం ఆధారంగా తన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు అగ్రరాజ్యం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఇమ్రాన్‌ రాజకీయ ర్యాలీలు నిర్వహించారు.

అటక్‌ జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌పై విషప్రయోగం(poisoned in jail) జరిగే అవకాశం ఉందని ఆయన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను వెంటనే అదియాలా జైలుకు తరలించాలని ఆమె(Imran Khan's wife ) డిమాండ్‌ చేశారు. న భర్త ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, ఆయనపై విష ప్రయోగం జరగొచ్చని ఆయన్ను మెరుగైన వసతులు ఉన్న జైలుకు తరలించాలని బుష్రా బీబీ పంజాబ్ హోంశాఖ కార్యదర్శి( home secretary)కి లేఖ రాశారు. ఇమ్రాన్‌ను అటక్‌ జైలు (Attock jail) నుంచి రావల్పిండిలోని అదియాలాకు తరలించాలంటూ సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించినట్లు గుర్తుచేశారు.


సరైన కారణాలు లేకుండా తన భర్తను అటక్ జైల్లో బంధించారని, చట్టప్రకారం ఆయన్ను అదియాలా జైలుకు తరలించాలని బుష్రా బీబీ (Bushra Bibi) ఆ లేఖలో డిమాండ్‌ చేశారు. ఇమ్రాన్‌పై గతంలో రెండు సార్లు హత్యాయత్నం(security and safety) జరిగిందని, వాటితో సంబంధం ఉన్నవారిని ఇంకా అరెస్టు చేయలేదని ఆమె గుర్తు చేసింది. ఆయన ప్రాణాలకు ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందని, అటక్ జైలులో ఆయనపై విషప్రయోగం జరిగే అవకాశం ఉందని బుష్రా బీబీ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ రాజకీయ హోదా దృష్ట్యా జైలులో బీ-క్లాస్ సౌకర్యాలు కల్పించాలని( B-class facilities) కోరారు. ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు ఇమ్రాన్‌కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపింది.

జైలు నిబంధనల ప్రకారం తన భర్తకు 48 గంటల్లోగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉందని.. అయితే, వాటి ఊసే లేదని ఆమె తన లేఖలో ఆరోపించారు. ఆయనకు మెరుగైన సౌకర్యాలు ఎందుకు నిరాకరించారనేదానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

జైలులో ఉన్న ఇమ్రాన్‌ను బుష్రా బీబీ ఇటీవలే కలుసుకున్నారు. దారుణమైన పరిస్థితుల మధ్య తన భర్తను ఉంచారని, సీ-క్లాస్ జైలు సౌకర్యాలు కల్పించారని విమర్శించారు. మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌కు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 22న డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టనుంది. ఇమ్రాన్‌ఖాన్‌ మేనల్లుడైన హసన్‌ఖాన్‌ నియాజీని విచారణ నిమిత్తం పోలీసులు సైన్యానికి అప్పగించారు. మే 9 నాటి లాహోర్‌ అల్లర్ల తర్వాత పరారీలో ఉన్న ఇతణ్ని ఆగస్టు 13న ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సులో పోలీసులు అరెస్టు చేశారు. నియాజీ చట్టపరమైన వ్యవహారాల్లో ఇమ్రాన్‌కు సలహాదారుగా ఉండేవారు.

Tags

Read MoreRead Less
Next Story