అంతర్జాతీయం

ఇంట్లో కనిపించిన వింత పాము.. అధికారులు షాక్

తల, తోక వింతగా ఉన్నాయి.. ఇంతకీ ఈ వెరైటీ పాము కనిపించింది

ఇంట్లో కనిపించిన వింత పాము.. అధికారులు షాక్
X

అబ్బాయ్.. ఇది పామేనంటవా.. లేక మీ తాతయ్య చేతి కర్రా.. ఇంత వెరైటీగా ఉంది.. మమ్మల్ని ఆట పట్టించడానికి పిలవలేదు కదా.. కదలకుండా స్ధబ్ధుగా పడి ఉన్న పాముని చూసి అధికారులు తటపటాయించారు.. మరి అది మామూలు పాముల్లా లేదు.. ఇంతకు ముందెన్నడూ చూడలేదు.. బుసలు కొట్టట్లేదు.. పడగ విప్పట్లేదు.. పైగా అంత పొడవు కూడా లేదు.. దానికి తోడు తల, తోక వింతగా ఉన్నాయి..

ఇంతకీ ఈ వెరైటీ పాము కనిపించింది ఇక్కడ కాదు అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో.. అక్కడ నివసిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో ఈ వింత పాము దర్శనమిచ్చింది. అసలే పాముని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఈ పాము రూపాన్ని చూసి ఇంకాస్త భయపడ్డాడు. వెంటనే అధికారులకు సమాచారం అందించాడు.

వర్జీనియాలో వైల్డ్‌లైఫ్ మ్యానేజ్‌మెంట్ కంట్రోల్ విభాగం ఉంది. ఇళ్లలో కనిపించే పాములను పట్టుకునేందుకు ఇక్కడ ప్రత్యేకంగా 24 గంటల స్నేక్ హాట్‌లైన్ అందుబాటులో ఉంటుంది. అనెంబరుకే కాల్ చేసిన సదరు వ్యక్తి అందించిన సమాచారంతో క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమయ్యారు స్నేక్ హంటర్స్.

పామును చూసి వాళ్లు కూడా షాకయ్యారు. దాదాపు అడుగు పైగా పొడవున్న ఆ పాము ఏ జాతికి చెందినదో వారికి కూడా అర్థం కాలేదు. దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది వెరైటీ పాము. అధికారులు దాన్ని పట్టుకుని దగ్గరలోని అడవిలో వదిలేశారు.

Next Story

RELATED STORIES